- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో ఓలా ఎలక్ట్రిక్ 'హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్' ఏర్పాటు!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించిన ఓలా ఎలక్ట్రిక్ రాబోయే కొన్ని నెలల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు అవసరమైన హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు గురువారం ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ దేశంలోని 100 నగరల్లో 5,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు, దీన్ని 400 నగరాలు, లక్ష ఛార్జింగ్ పాయింట్లకు పెంచాలని లక్ష్యంతో ఉన్నట్టు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ చెప్పారు. ఈ ఛార్జింగ్ పాయింట్లు హై-స్పీడ్ ఓలా ఛార్జింగ్ ద్వారా కేవలం 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని, ఇది 75 కిలోమీటర్ల ప్రయాణానికి వీలుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే, ఓలా స్కూటర్‌తో పాటు హోమ్ ఛార్జర్ వస్తుందని పేర్కోంది. మొదటి ఏడాదిలోనే 5,000 ఛార్జింగ్ పాయింట్ల లక్ష్యాన్ని నిర్దేశించామని, ఇది ప్రస్తుతం దేశంలో ఉన్న ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కంటే రెట్టింపు అని కంపెనీ వివరించింది.
భవిష్యత్తులో దీన్ని 400 నగరాలు, లక్ష ఛార్జింగ్ పాయింట్లకు విస్తరించనున్నట్టు కంపెనీ వివరించింది. అయితే, దీనికి ఎంతకాలం పడుతుందని, పెట్టుబడి వివరాలను పేర్కొనలేదు. హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్‌ను నగరాలు, వ్యాపారాలకు కేంద్రమైన జిల్లాల్లో టవర్లు, మాల్స్, ఐటీ పార్కులు, ఆఫీస్ సముదాయాలు, కేఫ్ వంటి చోట్ల ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. వీటి ఏర్పాటును కంపెనీ భాగస్వాములతో కలిసి నిర్మించనున్నట్టు వెల్లడించింది.