తమన్నా ‘నవంబర్ స్టోరీ’పై అప్‌డేట్

by Shyam |
తమన్నా ‘నవంబర్ స్టోరీ’పై అప్‌డేట్
X

దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ప్రసారమైన ‘లెవెన్త్ హవర్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తమన్నా.. ‘నవంబర్ స్టోరీ’ సిరీస్‌తో మరోసారి ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధం అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఒరిజినల్స్‌గా వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ఏడు నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్నా, కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది.

కాగా ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ మే 14 నుంచి స్ట్రీమ్ కాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారం కానున్న సిరీస్ టీజర్ ఇప్పటికే విడుదల కాగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రముఖ క్రైమ్ నావెల్ రైటర్ కూతురు.. ఓ క్రైమ్‌తో సంబంధం కలిగి ఉందన్న ఆరోపణల నుంచి ఎలా బయటపడిందనేది కథ కాగా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సక్సెస్‌ఫుల్ సిరీస్‌గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

Advertisement

Next Story