ఇప్పటికింకా నా వయసు నిండా పదహారేనంట.. బామ్మ బాధ వర్ణనాతీతం

by srinivas |   ( Updated:2021-12-28 00:34:45.0  )
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారేనంట.. బామ్మ బాధ వర్ణనాతీతం
X

దిశ, వెబ్‌డెస్క్ : “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే” అనే పాటను గుర్తు చేస్తోంది అధికారుల తీరు. 69 ఏళ్ల వయసున్న బామ్మను 16 ఏళ్ల వయసుకు తీసుకొచ్చారు. అది ఎలా సాధ్యం అయ్యింది అనుకుంటున్నారా.. కొన్ని కొన్ని సార్లు గుర్తింపు కార్డు, సర్టిఫికేట్‌లలో తప్పులు దొర్లుతూ ఉంటాయి. అయితే అవి అధికారుల తప్పిదం వలనా.. లేక మరే ఇతర కారణాలతో జరిగినా ఆ భారం మాత్రం బాధితులపై పడుతోంది. ఇలాంటి సంఘటనే తాజాగా చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

పాపం ఓ బామ్మను అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. పుత్తూరు మండలం తొరూరుకు చెందిన ఆదెమ్మకు ఉన్నట్టుండి పెన్షన్ ఆగిపోయింది. కరెంటు బిల్లుకు సంబంధించిన విషయంలో సమస్య తలెత్తడంతో ఆమె దాన్ని సరిచేసుకొని అధికారులను ఆశ్రయించింది అయినా ఫలితం లేకుండా పోయింది. పెన్షన్ కోసం ఎంత ఎదురు చూసినా.. పెన్షన్ రాలేదు దీంతో మరోసారి అధికారుల వద్దకు వెళ్లి సమస్య ఏంటి అడగ్గా ఓ సర్టిఫికేట్‌లో తన వయసు 16గా నమోదైంది అని చెప్పడంతో బామ్మ షాక్ అయ్యింది. పలుమార్లు అధికారుల చుట్టూ తిరుగుతూ.. సమస్యకు పరిష్కారం చూపమని అడుగగా చివరికి ఓ అధికారి సాధికార సర్వేలో సరిచేసుకోవాలని సలహా ఇచ్చారు. తీరా తహాశీల్దార్‌ను అడిగితే సాధికార సర్వే తీసేశామని చెప్పడంతో.. ఎంపీడీఓను విచారిస్తే చిత్తూరుకు వెళ్లండి లేదా కొత్త సర్వే కోసం అమరావతికి వెళ్లండని సూచించారు. పాపం బామ్మకు చదువు లేదు.. ఎక్కడికి వెళ్లాలో తెలియదు, సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడంతో బిక్కు బిక్కు మంటూ సహాయం కోసం ఎదురు చూస్తోంది.

Advertisement

Next Story

Most Viewed