‘గిరిజన గురుకులాల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను సస్పెండ్ చేయాలి’

by Shyam |
‘గిరిజన గురుకులాల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను సస్పెండ్ చేయాలి’
X

దిశ, తెలంగాణ బ్యూరో : గిరిజన గురుకులం సొసైటీలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను సస్పెండ్ చేయాలని ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ భీంరావ్ నాయక్ ఆదివారం ఒక ప్రటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకులాల్లో ముఖ్యంగా అసిస్టెంట్ సెక్రటరీ లింగారెడ్డి, స్పోర్ట్ ఆఫీసర్ రమేశ్, ఈఎంఆర్ఎస్ ఓఎస్డీ చంద్రశేఖర్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. వారు రిటైర్డ్ అయినా ప్రభుత్వం వీరిని కొనసాగిస్తోందని, అయితే గిరిజన గురుకులాల్లో భోదనేతర సిబ్బంది నియామకాల్లో వీరు లక్షల్లో డబ్బు దండుకుంటున్నారని పేర్కొన్నారు.

గతంలో జిల్లా జిల్లా సంయుక్త కలెక్టర్, ప్రాజెక్ట్ అధికారుల ద్వారా ఈ నియామకాలు చేపట్టేవారని, అయితే దానిని అసిస్టెంట్ సెక్రటరీ లింగారెడ్డి, ఇతర అధికారులు అడ్డుకొని డబ్బుల కోసం గిరిజనేతరులకు నియామకాలు చేసినట్లు ఆరోపించారు. ఈ విషయంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. అన్యాయంగా చేపట్టిన ఈ నియామకాలను రద్దు చేయడమే కాక, అక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని భీంరావ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed