ఆర్మీ హెలికాప్టర్ క్రాష్.. బ్లాక్ బాక్స్ ఎక్కడ..? బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి?

by Anukaran |   ( Updated:2021-12-08 06:59:32.0  )
ఆర్మీ హెలికాప్టర్ క్రాష్..  బ్లాక్ బాక్స్ ఎక్కడ..? బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. హెలికాప్టర్ ఎలా కూలిపోయింది? కారణాలేంటి? అనే దానిపై అత్యవసర విచారణకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆదేశించింది. ఈ క్రమంలో బ్లాక్ బాక్స్ కోసం ఆర్మీ అధికారులు వెతుకున్నారు. బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై క్లారిటీ రానుంది. సాంకేతిక లోపాలా? మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే దానిపై పూర్తి స్పష్టత రానుంది.

ప్రతికూల వాతావరణమా? హెలికాప్టర్ విద్యుత్ తీగలకు తాకిందా? తక్కువ ఎత్తులో ప్రయాణించిందా? విజిబులిటీ లేకపోవడమా? రాడార్‌తో అనుసంధానంలో సమస్య వచ్చిందా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. బ్లాక్ బాక్స్ లభ్యమయితే వీటిపై క్లారిటీ రానుంది.

బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి?

బ్లాక్ బాక్స్ ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. వెనుక భాగంలో దీనిని అమరుస్తారు. ప్రతి కదిలికను ఇది రికార్డు చేస్తూ ఉంటుంది. ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది.. ఎంత వేగంతో ప్రయాణిస్తుంది.. ఇంధనం ఎంత ఉంది. పైలట్ల సంభాషణలు.. ఇలా ప్రతిదీ బ్లాక్ బాక్స్‌లో నిరంతరం రికార్డు అవుతూ ఉంటుంది.

బిపిన్ రావత్ వెల్లింగ్టన్ వెళ్లడానికి కారణం అదేనా..?

Advertisement

Next Story