- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగన్‌వాడీలో ఆఫీసర్ల చేతివాటం
దిశ, సూర్యాపేట: పౌష్టికాహారలోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం బాలింతలు, గర్భిణులు, ఆరేండ్ల పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, కందిపప్పు ఇతర సామగ్రిని పంపిణీ చేస్తోంది. తద్వారా చిన్న పిల్లలకు క్యాల్షియం, కిషోర బాలికలకు ఐరన్ సమృద్ధిగా అందుతోందనేది సర్కారు లక్ష్యం. కానీ, ఈ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. జిల్లాలోని తుంగతుర్తి పరిధి అంగన్‌వాడీలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లో అంగన్‌వాడీ సెంటర్లు బందయ్యా యి. దాంతో రాష్ట్ర సర్కారు హోం ఫర్ ఫుడ్ అవకాశాన్నిచ్చింది. దీనిని సిబ్బంది, ప్రాజెక్టు ఆఫీసర్లు తమకు అనుగుణంగా మార్చుకుని పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. గుడ్లు, కందిపప్పు ఇతర సామగ్రి కిరాణా దుకాణానికి తరలించినట్లు సమచారం.
వసూళ్ల దందా..
ఆ మహిళ సీడీపీఓ పరిధిలో అంగనవాడీ కేంద్రంలో వంట బిల్లు సంబంధించి రూ.480 బిల్లును వేసేందుకు అంగ న్‌వాడీ టీచర్ వద్ద నుంచి వెయ్యి రూపాయలు వసూ లు చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో సక్రమంగా విధులు నిర్వహించినా.. ప్రాజెక్ట్ ఆఫీసర్ తమను ఇబ్బందులకు గురి చేస్తోందని టీచర్లు ఆరోపిస్తున్నారు. కరోనా కాలంలో స్థానికంగానే ఉన్నా.. ఉండలేదని నెలవారీగా రికార్డులు సరిగా రావడం లేదని, నెలకు రూ.500 చొప్పున ప్రతి సెంటర్ నుంచి ఇవ్వాల ని తుంగతుర్తి సీడీపీవో టీచర్లను ఆదేశించినట్లు చెబుతున్నారు. దసరా సందర్భంగా శాఖ ఉన్నతాధికారులకు ఇవ్వాలని చెప్పి సూపర్‌వైజర్లు అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి రూ.300 వసూలు చేసి పంపినట్లు వినికిడి.
సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ నుంచి బాలింతలకు కందిపప్పు, నూనె, పాలు, గుడ్లు, బియ్యం ఇతర సామగ్రి ప్రతి నెలా పంపిణీ చేస్తారు. గర్భిణిగా నమోదు చేసుకున్న నాటి నుంచి డెలివరీ అయిన తర్వాత 5 నెలల వరకు నెల నెలా మూడు కిలోల సరుకులను అంగన్‌వాడీ టీచర్లు అందజేస్తారు.
అయితే, కొవిడ్ విపత్కర కాలంలో బాలింతలు, గర్భిణులు, పిల్లలకు అందాల్సిన సరుకులను వారి ఇంటి వద్ద అందజేయకుండా.. బయట షాపులలో విక్రయించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వీటితో పాటు సెంటర్ నుంచి విజిటింగ్ చేసినప్పుడు కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు, పౌష్టికాహారం తన కారులో నింపుకొని వెళుతుందని విమర్శలున్నాయి. తుంగతుర్తి సూ పర్‌వైజర్, సీడీపీవో తమ వద్ద బలవంతంగా వసూళ్లకు పాల్పడుతుందని, ప్రతి సెంటర్ నుంచి నెల నెలా మామూలు ఇవ్వాలని ఫోన్‌లో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
సమగ్ర విచారణ జరిగేనా.?
సోషల్ మీడియాలో, లిఖితపూర్వకంగా కలెక్టర్ కు స్థానికులు ఫిర్యాదు చేశారు. జిల్లా సంక్షేమ అధికారిని విచారణాధికారిగా నియమిస్తూ ఉ త్తర్వులు జారీ చేసి, తుది నివేదిక సమర్పించాల ని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయా న్ని ముందే పసిగట్టిన సీడీపీవో, స్థానిక ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి మరొక ప్రభుత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ఫోన్ చేయించి విచారణ జరపడానికి వీలు లేదు అని హుకుం జారీ చేయించింది. అయితే, తాను కలెక్టర్ ఆదేశాలు పాటిస్తానని విచారణా అధికా రి తేల్చిచెప్పారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి వేరే శాఖ అధికారిని విచారణా అధికారిగా నియ మించి, ఆడియో రికార్డులు, ఇతర ఆధారాలపై సమగ్ర విచారణ జరిపించాలని, తుది నివేదికను రాష్ట్రస్థాయి ఆఫీసర్లకు సమర్పించి తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు ఫిర్యాదు
సీడీపీవో మీద వచ్చిన ఆరోపణల నేపథ్యం లో స్థానిక రాజకీయ నాయకుల ద్వారా విచారణ అధికారుల మీద ఒత్తిడి తీసుకువస్తున్న కారణంగా సీడీపీవో బాధితులు ట్విట్టర్ వేదికగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కి ఆధారాలతో ట్వీట్ చేసినట్లు ఈ ప్రాంతంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.