- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KFCలో ఉడకని చికెన్.. జరిమానా విధించిన అధికారులు
దిశ, శేరిలింగంపల్లి: కేఎఫ్ సీ చికెన్ అంటే చాలు భోజన ప్రియులకు నోరూరుతుంది. చికెన్ ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. చిన్న పిల్లల నుండి మొదలు పెద్ద వారి వరకు హాయిగా లాగించేస్తారు. కానీ కేఎఫ్ సీ స్టోర్ లో మాత్రం కస్టమర్లకు ఉడకని చికెన్ పెట్టి వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. లాక్ డౌన్ అనంతరం కేఎఫ్ సీ సెంటర్లు తిరిగి తెరుచుకోవడంతో చికెన్ ప్రియులు మళ్లీ కేఎఫ్ సీ సెంటర్లకు క్యూ కడుతున్నారు. కానీ తాజాగా ఓ కొనుగోలుదారుడుకు కేఎఫ్ సీ లో చికెన్ ఆర్డర్ చేస్తే చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చికెన్ తిందామని సాయితేజ అనే వ్యక్తి జేఎన్ టీయూ మెట్రో స్టేషన్ లోని కేఎఫ్ సీ సెంటర్‌కు వెళ్లి అక్కడ చికెన్ బకెట్ ఆర్డర్ ఇవ్వగా.. కేఎఫ్ సీ సిబ్బంది సరిగ్గా ఉడకని చికెన్ ముక్కలను సర్వ్ చేశారు. అది చూసిన కస్టమర్ షాక్ అయ్యి ఇలా ఉందేంటీ అని సిబ్బందిని వివరణ కోరగా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని అతను ట్విట్టర్ వేదికగా అధికారులకు పోస్టు చేశాడు. తనకు సరిగ్గా ఉడకని చికెన్ ఇవ్వడంతో పాటు కనీసం రెస్పాండ్ కూడా అవ్వడం లేదంటూ అందులో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు సంబంధిత స్టోర్ కు జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకుంటే స్టోర్ ను క్లోజ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
- Tags
- jntu
- KFC CHICKEN