- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా సాధికారతకు ఒడిషా సర్కారు సంచలన నిర్ణయం
దిశ, ఫీచర్స్ : మహిళల స్వావలంబనకు కృషి చేసేందుకు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ‘మిషన్ శక్తి’ ప్రోగ్రామ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మహిళల ఆధ్వర్యంలో నడిచే స్వయం సహాయక సంఘాలకు ఏటా రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నారు. వారి అవసరాల నిమిత్తం జిల్లా, బ్లాక్, పంచాయతీ స్థాయిల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాలు, ఇతర ప్రాపర్టీలను వాడుకునేందుకు ఇవ్వాలని తాజాగా ఆదేశించారు. ‘నారీ శక్తి, నారీ సమ్మాన్, నారీ స్వావలంబన్’ అనే నినాదాలతో ముందుకు సాగుతున్న ‘మిషన్ శక్తి’ ప్రోగ్రామ్ ద్వారా మహిళలకు చేయూతనిస్తున్నారు. ఈ మేరకు రెండు నెలల్లో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను స్వయం సహాయక సంఘాలకు అప్పజెప్పాలని ఒడిషా సీఎం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాపర్టీలు ఉపయోగపడనున్నాయి.