- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెచ్చిపోతున్న కబ్జాదారులు.. చివరికి వాటిని కూడా వదలకుండా
దిశ, చార్మినార్: చెరువులను ఆక్రమించుకుని యథేచ్చగా వెంచర్‌లు చేస్తూ.. అక్రమార్కులు, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, అయినా పాలకులు గానీ, అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదనే ఆరోపణలున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులు కబ్జాబారిన పడకుండా పరిరక్షించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, అభివృద్దికి నోచుకోని చెరువుల సుందరీకరణకు కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నామని, మంత్రుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చెరువులన్నా కబ్జాలకు గురికాకుండా పరిరక్షించాలని ఇటీవల చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చర్చించినా.. అవేమి పట్టించుకోకుండా కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారని, తాజాగా పాతబస్తీ బహదూర్ మీర్ ఆలం చెరువును రెండు వేరు ప్రాంతాల్లో మట్టితో పూడ్చేస్తున్నారని తెలిపారు.
25 రోజులుగా పూడ్చివేతలు..
25 రోజులుగా లారీలలో మట్టిని తెచ్చి చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను ఆక్రమించుకుని యథేచ్చగా వెంచర్‌లు చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వాపోయారు. చెరువుల సుందరీకరణ పక్కన పెడితే చెరువులు కబ్జాకు గురికాకుండా పరిరక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే మీరాలం చెరువు స్థలాన్ని పూర్తిగా ఆక్రమించడంతో దాని సామర్ద్యం పూర్తిగా తగ్గిపోయిందని, ఇటీవల కురిసిన వర్షానికి మీరాలం చెరువు అలుగు పారి దానికి దిగువ ప్రాంతాల్లోకి, జూపార్కులోకి భారీగా వరద నీటి ప్రవాహం వచ్చిందని పేర్కొన్నారు. మీర్ ఆలం చెరువు నుంచి సఫారీ పార్కులోకి.. సఫారీ పార్కు నుంచి జూలోని కొలనులోకి వస్తున్న వరద ప్రవాహానికి జూ అధికారులు సఫారీ పార్కును కూడా మూసివేసిన విషయం విధితమే. జూలోకి నీరు చేరడంతో అందరు ఆందోళన చెందారు. కానీ, జూలోని జంతువులకు ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో ముప్పు తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ మీర్ ఆలం చెరువు కబ్జాకు గురౌతుండడంతో స్థానిక ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టీపట్టనట్లు అధికారులు..
బుర్హాన్ ఖాన్ చెరువును కబ్జా చేస్తే ఫలితాలు ఎలా ఉన్నాయో అందరికి అర్థమయినా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పహాడి షరీఫ్ బుర్హాన్ చెరువు స్థలాన్ని కూడా కబ్జా చేసి మట్టితో పూడ్చారు. ఆ తర్వాత ఆ స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందన్న ఆశతో స్థలాలు కొని, కట్టుకున్న ఇండ్లు మున్నాళ్ల ముచ్చటగానే మారాయని బాధిత వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సెప్టెంబర్‌తో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉందానగర్ పూర్తిగా మునిగిపోయిందని, అక్కడ రాకపోకలు కూడా స్తంభించి పోవడంతో స్థానికులు ఇండ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లామన్నారు. చెరువులు ఆక్రమణకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి ఉందానగర్ ప్రాంతాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. చెరువులు, కుంటలు యథేచ్చగా కబ్జాలకు గురౌతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని చెరువు సమీప ప్రజలు ఆరోపిస్తున్నారు.