జలవనరుల శాఖకు తుది మెరుగులు..!

by Anukaran |
జలవనరుల శాఖకు తుది మెరుగులు..!
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో జల వనరుల శాఖ ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే దీనికి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. నేడో, రేపో అసెంబ్లీలో సీఎం ప్రెజంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, బరాజ్‌లు, ఎత్తిపోతల పథకాలకు సీఈలను ఖరారు చేశారు. క్షేత్రస్థాయిలో 19 మంది చీఫ్ ఇంజినీర్లు ఉంటారు. వీరి పర్యవేక్షణలో 1.24 కోట్ల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. మొత్తం ఐడీసీ లిఫ్ట్‌లతో పాటు 44,548 చెరువుల బాధ్యతలు వీరికే ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి ఆరుగురు సీఈలకు రానుంది. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రామగుండం, గజ్వేల్, సంగారెడ్డి సీఈలకు ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి వస్తుంది. ఎస్సారెస్పీ జగిత్యాల సీఈ పరిధిలో ఉంటుంది.

సూర్యాపేట సీఈ బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, మూసీ ప్రాజెక్టు రిజర్వాయరును పర్యవేక్షిస్తారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిని నాగర్ కర్నూల్, హైదరాబాద్ సీఈలకు కేటాయించారు. 19 మంది క్షేత్రస్థాయి సీఈలతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్, ఎంక్వయిరీస్, సెక్రెటరియేట్, వాలంతరీ, సీడీఓ విభాగాలకు వేర్వేరుగా సీఈలు ఉండనున్నారు. ఎంక్వయిరీస్ సీఈ శాఖా పరమైన విచారణలను చూసుకుంటారు. సీటీఈ సీఈ సాంకేతిక అంశాలు, ఎస్టిమేట్లు, ఈఓటీ తదితర అంశాలను నిర్వహిస్తారు. క్వాలిటీ కంట్రోల్ సీఈ పరిధిలో ఇరిగేషన్ పనులు ఉంటాయి. సీడీఓ సీఈ పరిధిలో ఇరిగేషన్ ప్రాజెక్టులకుసంబంధించిన డిజైన్ అంశాలున్నాయి. వాలంతరీ సీఈ పరిధిలో శిక్షణా అంశాలు, అధ్యనం, హైడ్రాలజీ, ఇంజినీరింగ్ మెటీరియల్, సాయిల్ టెస్టింగ్, ల్యాబ్ నివేదికలు తదితరల అంశాలున్నాయి.

జనరల్ ఈఎన్సీ ఇరిగేషన్ ప్రాజెక్టులను మానిటరింగ్ చేస్తారు. అడ్మిన్ ఈఎన్సీ, అపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ కొనసాగనున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు ఈఎన్సీలు ఉన్నారు. మరో మూడు పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. 22 సీఈ పోస్టులలో 19 మంది ఉండగా, మరో ముగ్గురిని పదోన్నతుల ద్వారా నియమిస్తారు. 57 ఎస్ఈ పోస్టులకు 47 మంది ఉన్నారు. 10 మందిని పదోన్నతుల ద్వారాభర్తీ చేస్తారు. 234 ఈఈ పోస్టులకు 206 మంది, 892 డీఈ పోస్టులకు 678 మంది, ఏఈ పోస్టులు 2,796 ఉండగా, 2436 మంది ఉన్నారు. మిగతా పోస్టులను రిక్రూట్ మెంట్, ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేస్తారు.

సీఈల పరిధులు ఇలా..

ఆదిలాబాద్ సీఈ పరిధిలో పిప్పల్‌కోటి రిజర్వాయరు, గోముత్రి, కడెం, సాత్నాలా, స్వర్ణ, గడ్డెన్నవాగు, మత్తడి వాగు, కుప్తి ప్రాజెక్టులు, చనఖా-కొరటా, లక్ష్మీనర్సింహస్వామి ఎత్తిపోతల పథకంలో మూడు, శారదా దేవి, గూడెం పంపు హౌస్‌లు. చనాఖా-కొరటా, సదర్మతి బరాజ్‌లు ఉంటాయి. మంచిర్యాల సీఈ పరిధిలో వట్టివాగు ప్రాజెక్టు, ఎన్‌టీఆర్ సాగర్, ఎర్రవాగు (పీపీ రావు ప్రాజెక్టు), కొమురం భీం, నీల్వాయి, గొల్లవాగు, రాళ్లవాగు, జగన్నాథపూర్ పెద్దవాగు రిజర్వాయరు. చెన్నూరు వాగు ఎత్తిపోతల్లో మూడు పంపులు, డా. బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టులో రెండు పంపు హౌస్‌లు. డా. బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత బరాజ్ ఉంటాయి.

నిజామాబాద్ సీఈ పరిధిలో కొండం చెరువు (కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 21), రామడుగు ప్రాజెక్టు. అలీసాగర్ ఎత్తిపోతల్లో మూడు, గుత్ప ఎత్తిపోతల్లో రెండు, లక్ష్మీ కెనాల్లో నాలుగు, చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల్లో మూడు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 20లో ఒకటి, ప్యాకేజీ 21లొ ఒక పంప్ హౌస్ ఉంటాయి. కామారెడ్డి సీఈ పరిధిలో నిజాంసాగర్, కట్వాడి (ప్యాకేజీ 22), భూంపల్లి (ప్యాకేజీ 22), తిమ్మక్కపల్లి (ప్యాకేజీ 22), ధర్మరావుపేట ట్యాంక్ (ప్యాకేజీ 22), ముద్దోజీవాడి (ప్యాకేజీ 22) రిజర్వాయర్లు, కౌలాస్‌నాలా, పోచారం ప్రాజెక్టులు, మంజీరా (నాగమడుగు) లిప్ట్, కాళేశ్వరం ప్యాకేజీ -22లో రెండు పంప్ హౌసులు ఉంటాయి.

జగిత్యాల సీఈ పరిధిలో ఎస్సారెస్పీ డ్యాం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ఎత్తిపోతలు మూడు ఉంటాయి. కరీంనగర్ సీఈ పరిధికి ఎల్ఎండీ, శ్రీ రాజరాజేశ్వర (ఎంఎంఆర్), గౌరవెల్లి, గండిపల్లి, తో టపల్లి రిజర్వాయర్లు, అప్పర్ మానేరు, కాళేశ్వరం ప్యాకేజీ 9లోని మలక్‌పేట్, సింగసముద్రం, బాట్ల చెరువు ప్రాజెక్టులు, గండిపల్లి, తోటపల్లి, ప్యాకేజీ నెంబర్ 9లో రెండు, వేములవాడ గుడి చెరువు పంప్ హౌస్ లు వస్తాయి. రామగుండం సీఈ పరిధిలో ప్యాకేజీ నెం. 6 (మేడారం), శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్లు, మూలవాగు, బొగ్గులవాగు ప్రాజెక్టులు, మేడిగడ్డ, అన్నారం, సుంది ళ్ల, నందిమేడారం, గాయత్రి, శ్రీపాద ఎల్లంపల్లిలో ఆరు, ముక్తేశ్వర ఎత్తిపోతల్లో రెండు, మంథని ఎత్తిపోతల్లో రెండు, ఎన్టీపీసీ లిప్ట్, రామగుండం ఎత్తిపోతల రెండు పంప్ హౌస్ లు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ లు ఉంటాయి.

వరంగల్ సీఈ పరిధిలో ధర్మసాగర్, దేవాదుల ఫేజ్ -2లో ఆర్ఎస్ ఘనపురం, అశ్వరావుపల్లి, చీటకొడూరు, గండి రామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాస్‌పల్లి, ఫేజ్ -3లో నష్కల్, పాలకుర్తి, చెన్నూరు, నవాబ్‌పేట, లద్దనూరు, కన్నెబోయినగూడెం, మారెడ్డి చెరువు, ఐనాపూర్, ఎస్సారెస్పీలో మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు. చలివాగు (ఫేజ్ -2), పాలకుర్తి (పేజ్ -1), దేవన్నపేట టన్నైల్, ధర్మసాగర్ లో రెండు, ఆర్ఎస్ ఘనపురం, ఈఎం-1, 5లో రెండు, ధర్మసాగర్ ప్యాకేజీ 4, గండి రామారం ఫేజ్ -2, గండిరామారం ఫేజ్ -3, బొమ్మకూరు పంప్ హౌస్ లు ఉంటాయి. ములుగు సీఈ పరిధిలో పాలెం వాగు, గుండ్ల వాగు, మొదికుంట వాగు, మల్లూరు వాగు, పాఖాల, లక్నవరం, రామప్ప, బొగ్గులవాగు, నర్సింగాపూర్ ట్యాంక్, భీంఘన్‌పూర్ రిజర్వాయర్లు. ఇంటెక్ ఫేజ్ -1, ఇంటెక్ ఫేజ్ -2, ఫేజ్ -3, భీం ఘన్‌పూర్ ఫేజ్ -1, భీంఘన్‌పూర్ ఫేజ్ -2,3లో రెండు, రామప్ప ఫేజ్ -3, రామప్ప టూ పాఖాల ఎత్తిపోతల్లో ఒక పంప్ హౌస్.
సమక్క బరాజ్ ఉంటాయి.

సంగారెడ్డి సీఈ పరిధికి సింగూరు, నల్లవాగు రిజర్వాయర్లు, సంగమేశ్వరం, బసవేశ్వర, సిల్లారపు రాజనర్సింహ స్టేజ్ -1 (సింగూరు) పంప్ హౌస్ లు, గజ్వేల్ సీఈ పరిధికి అన్నపూర్ణ, రంగనా యకసాగర్, శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లు, శనిగరం, శామీర్‌పేట లేక్, వనదుర్గ ప్రాజెక్టు, అనంతగిరి ప్యాకేజీ 10, రంగనాయక సాగర్ ప్యాకేజీ -11, కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్యాకేజీ-12, పాములపర్తి అక్కారం, పాములపర్తి మర్కూరు పంప్ హౌస్ వస్తాయి.

నల్గొండ సీఈ పరిధిలో నాగార్జునసాగర్, ఏఎంఆర్ ఎస్ఎల్‌బీసీ పరిధిలోని డిండి బ్యాలెన్సింగ్, పెండ్లిపాక, పుట్టంగండి, అక్కంపల్లి బ్యాలెన్సింగ్, ఉదయసాగరం, ఎట్టిపాముల. ఉదయ సముద్రం పరిధిలోని బ్రాహ్మణ వెల్లంల, డిండి ఎత్తిపోతల పరిధిలోని సింగరాజపల్లి, ఎర్రవల్లి గోకారం, గొట్టిముక్కల, ఛింతపల్లి, ఇర్వాని, కిష్టంపల్లి, శివన్నగూడెం, డిండి రిజర్వాయర్లు, ఏఎంఆర్ ఎస్ఎల్‌బీసీ హైలెవల్, పుట్టన్నగూడెం, లో లెవల్ కెనాల్, పుల్ల తండా, బ్రాహ్మణ వెల్లంల నార్కట్ పల్లి పంప్ హౌస్ లు, ఉల్పారా బరాజ్ వస్తాయి. సూర్యాపేట సీఈ పరిధిలో బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్, మూసీ ప్రాజెక్టు రిజర్వాయర్లు ఉంటాయి.

వనపర్తి సీఈ పరిధిలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, పీజేపీ డ్యాం, జమ్ములమ్మ, రామన్‌పాడు, గొపాలదిన్నె, నెట్టెంపాడు ఎత్తిపోతల పరిధిలోని గుడ్డెందొడ్డి, రేలంపాడు బ్యాలెన్సింగ్, తాటికుంట, నాగర్‌దొడ్డి, ముచ్చొనిపల్లి, సంగాల, చిన్నొనిపల్లి రిజర్వాయర్లు, రాజీవ్ భీమా లిప్ట్ పరిధిలోని ఏనుకుంట, రంగసముద్రం, శంకర సముద్రం, క్రిష్ణ సముద్రం రిజర్వాయర్లు.

జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల్లో రెండు, రాజీవ్ భీమా ఎత్తిపోతల్లో రెండు, గట్టు ఎత్తిపోతల్లో ఒకటి, తుమ్మిళ్ల ఎత్తిపోతల్లో ఒక పంప్ హౌస్ ఉంటాయి. మహబూబ్‌నగర్ సీఈ పరిధిలో కురుమూర్తిరాయ, ఉద్దండపూర్, కోయిల్‌సాగర్ బ్యాలెన్సింగ్, బుద్దాపూర్, సంగంబండ రిజర్వాయర్లు, కురుమూర్తిరాయ, కోయిల్ సాగర్‌లో రెండు, భీమా ఎత్తిపోతల్లో రెండు పంప్ హౌస్‌లు. నాగర్ కర్నూల్ సీఈ పరిధికి కల్వకుర్తి ఎత్తిపోతల ఎల్లూరు, సింగోటం బ్యాలెన్సింగ్, జొన్నలగూడ, గుడిపల్లిగట్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల అంజన్నగిరి నార్లపూర్, వీరాంజనేయ, ఏదుల, వెంకటాద్రి వట్టెం రిజర్వాయర్లు. కల్వకుర్తి పరిధిలోని ఎల్లూరు, జొన్నలబొగూడ, గుడిపల్లిగట్టులో మూడు, పాలమూరు-రంగారెడ్డి పరిధిలోని అంజన్నగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి పంప్ హౌస్‌లు ఉంటాయి.

హైదరాబాద్ సీఈ పరిధిలో పాలమూరు-రంగారెడ్డి లక్ష్మీదేవిపల్లి, గందమల్ల (ప్యాకేజీ 15), బస్వాపూర్ (ప్యాకేజీ 16), మూసీ కత్వాస్, కోటిపల్లి వాగు, శివసాగర్ రిజర్వాయర్లు. పాలమూరు- రంగారెడ్డి ఉద్దండాపూర్, రాచకొండ ఎత్తిపోతలు ఉంటాయి.

కొత్తగూడెం సీఈ పరిధిలో తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగు, ఎల్‌టీ బయ్యారం రిజర్వాయర్లు. ఎస్ఆర్ఎల్ఐఎస్‌లోని బీజీ కొత్తూరు, రామవరం, ముల్కలపల్లి ఎత్తిపోతలు. సీతమ్మసాగర్ బరాజ్. ఖమ్మం సీఈ పరిధికి పాలేరు, వైరా, లంకా సాగర్ రిజర్వాయర్లు. భక్త రామదాసు ఎత్తిపోతల్లోని దిబ్బగూడెం, ఎర్రగుట్ట తండా పాలేరు పంప్ హౌస్ ఉంటాయి.

Advertisement

Next Story