- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో కొత్తగా 79కరోనా కేసులు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. రెండ్రోజులుగా 100లోపే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 28,254మందికి పరీక్షలు నిర్వహించగా 79మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,88,178కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 7,157గా ఉంది. ప్రస్తుతం 1,154 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,79,867మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 87మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,32,42,802మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అనంతపురం జిల్లాలో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చిత్తూరులో ఐదుగురికి, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, గుంటూరులో 12, కృష్ణా జిల్లాలో 20, కర్నూలులో 1, నెల్లూరులో 3, ప్రకాశం జిల్లాలో 5, శ్రీకాకుళం జిల్లాలో 3, విశాఖపట్నంలో 13, విజయనగరంలో 1, పశ్చిమగోదావరి జిల్లాలో 6 కేసులు వచ్చాయి. కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఇవాళ కరోనాతో ఎటువంటి మరణం సంభవించలేదని హెల్త్ బులెటిన్ వెల్లడించింది.