- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నారైలూ అలాక్కాదు.. సీతమ్మ స్పష్టత!
కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన ఎన్నారైలు పన్ను చెల్లించాలనే అంశం పెద్ద చర్చనీయంసమైంది. భారత్‌లో ఆదాయ పన్ను అంశంలో ఎన్నారైలు ఎలా భాగస్వామ్యం అవుతారనే పెద్ద ప్రశ్నకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. ఎన్నారైలు ఎవరైనా సరే తాము నివశిస్తున్న దేశంలో ఉంటూనే ఇండియాలో కూడా ఆదాయాన్ని పొందుతున్నట్టు అయితేనే పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
ఇతర దేశాల్లో నివశిస్తూ అక్కడ సంపాదించే దాంట్లోంచి ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టంగా చెప్పారు. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానాన్ని అర్థం చేసుకోవడంలో అయోమయానికి గురి కావద్దని ఆమె అన్నారు. ఎన్నారైలు ఇతర దేశాల్లో ఆదాయాన్ని పొందినా కూడా ఇక్కడి ఆస్తుల నుంచి కూడా ఆదాయం పొందుతున్నట్టు తేలితే వచ్చిన ఆ ఆదాయంలోంచి పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. అవసరమైతే ఈ నిబంధనను చట్టంలో చేరుస్తామని ఆమె వెల్లడించారు.