శ్రీ పద్మావతి అమ్మవారికి NRI దంపతుల భారీ కానుక

by Nagaya |
శ్రీ పద్మావతి అమ్మవారికి NRI దంపతుల భారీ కానుక
X

దిశ ప్రతినిధి, తిరుచానూరు : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి అమెరికాకు చెందిన అశ్విన్ పుప్పాల దంపతులు లక్ష్మీకాసుల హారాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఈవో గోవింద రాజన్ మాట్లాడుతూ సుమారు రూ. 9.22 లక్షల విలువైన 120 గ్రాముల లక్ష్మీకాసులహారాన్ని అమ్మ వారికి కానుకగా ఇచ్చిరాని చెప్పారు. అనంతరం ఎన్నారై అశ్విన్ పుప్పాల దంపతులు మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారికి లక్ష్మీకాసుల హారాన్ని అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీర్వాద బలంతోనే హారాన్ని ఇవ్వగలిగామని అన్నారు. ఈసందర్భంగా కుంకుమార్చన సేవలో పాల్గొన్న ఎన్నారై దంపతులకు అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శేషగిరి, ఆలయ సీనియర్ అర్చకులు బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story