పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

by Shyam |   ( Updated:2021-04-17 08:59:37.0  )
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏకలవ్వ మోడల్ గురుకుల పాఠశాలల భర్తీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 262 పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. ఇందులో ప్రిన్సిపాల్ 11, వైస్ ప్రిన్సిపాల్ 06, పిజిటి 77, టిజిటి 168 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత,ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం www.telanganaemrs.in, www.tribal.nic.in, www.recruitment.nta.nic.in వెబ్ సైట్లను చూడాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed