‘మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ నుంచి సీఎస్‌కు నోటీసులు’

by Ramesh Goud |
‘మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ నుంచి సీఎస్‌కు నోటీసులు’
X

దిశ‌ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ధరణి పోర్టల్‌లో అక్రమాల‌తో రైతులు ఆత్మహ‌త్యల‌కు పాల్పడుతున్నార‌ని, రైతుల ఆత్మహ‌త్యల‌పై విచారణ చేప‌ట్టాల‌ని చేసిన ఫిర్యాదు మేరకు.. మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ స్పందించిన‌ట్లు కాంగ్రెస్ నేత బ‌క్క జ‌డ్సన్ బుధ‌వారం ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. ఈమేర‌కు తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు 4 వారాల్లో నివేదిక సమర్పించాలని క‌మిష‌న్ నుంచి నోటీసులు జారీ అయిన‌ట్లు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖలో భారీ అవకతవకలు ఇందుకు నిదర్శనమన్నారు. రెవెన్యూ శాఖకు మంత్రి లేకపోవడం, కార్యదర్శి లేకపోవడం, సీసీఎల్ఎ లేకపోవడ‌మేన‌ని అక్రమాలకు కారణమన్నారు. రెవెన్యూ శాఖ ఎవ్వరికి ఇవ్వకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను, రైతులను, రెవెన్యూ సిబ్బందిని అతలాకుతలం చేస్తూ పరిపాలనను భ్రష్టు ప‌ట్టిస్తున్నార‌ని ఆరోపించారు.

Advertisement

Next Story