- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Currency Circulation : 17 శాతం పెరిగిన కరెన్సీ చలామణి!
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ(RBI) విడుదల చేసిన వార్షిక నివేదికలో.. దేశంలోని కరెన్సీ చలామణి(Currency Circulation) విలువ పరంగా 16.8 శాతం పెరిగినట్టు వెల్లడించింది. నోట్ల సంఖ్య పరంగా చూస్తే ఇది 7.2 శాతం పెరిగింది. కొవిడ్ కారణంగా ప్రజలు నగదును ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకుంటున్నారని నివేదిక తెలిపింది. 2019-20లో విలువ పరంగా ఈ వృద్ధి 14.7 శాతం, నోట్ల పరంగా 6.6 శాతంగా నమోదైనట్టు ఆర్‌బీఐ పేర్కొంది. ఇక, ఈ ఏడాది మార్చి చివరి నాటికి చెలమణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ. 500, రూ. 2,000 నోట్ల విలువ మాత్రమే 85.7 శాతంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో వీటి విలువ 83.4 శాతంగా ఉండగా, అత్యధికంగా రూ. 500 నోట్లు చలామణిలో ఉన్నాయి. మొత్తం చలామణిలో వీటి వాటానే 31.1 శాతం కాగా, రూ. 10 నోట్ల సంఖ్య 23.6 శాతంగా ఉంది. అదేవిధంగా, 2020-21లో దేశవ్యాప్తంగా మొత్తం 2,08,625 నకిలీ నొట్లు బయటపడినట్టు నివేదిక తెలిపింది. ఇందులో 96.1 శాతం నొట్లను బ్యాంకుల వారు, 3.9 శాతం నోట్లను ఆర్‌బీఐ గుర్తించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి తగ్గాయి.