స్క్విడ్ గేమ్‌ను USB డ్రైవ్‌లలో తెచ్చుకున్నందుకు కాల్చిచంపారు.. ఎక్కడో తెలుసా?

by Shamantha N |   ( Updated:2021-11-25 06:26:34.0  )
స్క్విడ్ గేమ్‌ను USB డ్రైవ్‌లలో తెచ్చుకున్నందుకు కాల్చిచంపారు.. ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియా డ్రామా “స్క్విడ్ గేమ్” ప్రపంచవ్యాప్తంగా హైప్‌ని క్రియేట్ చేసింది. ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజాదరణ పొందగలిగింది. కానీ ఉత్తర కొరియన్లకు ఈ గేమ్‌ను తక్కువ ధరకు ఇచ్చింది. అమెరికన్ న్యూస్ మీడియా అవుట్‌లెట్ రేడియో ఫ్రీ ఆసియా (RFA) నివేదిక ప్రకారం.. ‘స్క్విడ్ గేమ్‌ను రహస్యంగా చూస్తూ పట్టుబడిన పలువురు హైస్కూల్ విద్యార్థులకు ఉత్తర కొరియా కఠిన శిక్ష విధించింది. అంతేకాకుండా, సరిహద్దుల దాటి USB డ్రైవ్‌లలో స్క్విడ్ గేమ్‌ను దిగుమతి చేసుకున్న పౌరులు కాల్చి చంపబడ్డారు. అయితే దానిని కొనుగోలు చేసిన విద్యార్థులకు జీవిత ఖైదు విధించారు. గేమ్ చూసిన ఇతర విద్యార్థులకు ఐదు సంవత్సరాల లేబర్ రిఫార్మ్స్ శిక్ష విధించింది.

Advertisement

Next Story

Most Viewed