- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం.. రెండువేల మందితో భారీ ధర్నా (వీడియో)
దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జిల్లాలో గిరిజనేతరుల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జిల్లాలోని కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల ఏజెన్సీ మండలాల్లోని గిరిజనేతరులు దాదాపు రెండువేల మందితో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మానుకోట కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కలెక్టరేట్ వద్దకు చేరుకొని వారిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గిరిజనేతరులకు-పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ సందర్భంగా గిరిజనేతర రైతులు మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు మండలాల్లోని బీసీ, ఎస్సీ, ఓసీ మరియు మైనార్టీలు 70-80 సంవత్సరాల నుంచి ఏజెన్సీలోనే ఉంటున్నామని తెలిపారు. పోడు వ్యవసాయమే జీవనాధారంగా చేసుకొని గిరిజనులతో పాటు మేము కూడా జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు గ్రామ కమిటీల్లో, ఎఫ్‌ఆర్‌సీ కమిటీల్లో 1/3 ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజనేతరులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టా పుస్తకాలు ఇవ్వాలని కోరారు.