- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
5జీ ట్రయల్స్‌లో రికార్డు సృష్టించిన ఎయిర్‌టెల్!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఇప్పటికే పలు దిగ్గజ టెలికాం సంస్థలు 5జీ టెక్నాలజీ పరీక్షలను వేగవంతం చేశాయి. గురువారం దేశీయ దిగ్గజ భారతీ ఎయిర్‌టెల్ 5జీ ట్రయల్స్‌లో సరికొత్త రికార్డును సాధించింది. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌తో భారత్‌లో 5జీ ట్రయల్స్ నిర్వహించిన మొదటి టెలికాం కంపెనీగా ఎయిర్‌టెల్ నిలిచింది. నోకియా భాగస్వామ్యంతో కోల్‌కతాలో ఈ 5జీ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్టు కంపెనీ పేర్కొంది. ఈ ట్రయల్స్ కోసం ఎయిర్‌టెల్ కంపెనీ నోకియా సంస్థకు చెందిన 5జీ పరికరాలను వినియోగించింది. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ సహాయంతో రియల్‌టైమ్ పరిస్థితుల్లో 3జీపీపీ ప్రామాణిక రెండు ప్రాంతాల మధ్య 40 కి.మీల హై-స్పీడ్ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాంక్ నెట్‌వర్క్ కవరేజీ సాధించామని ఎయిర్‌టెల్ వివరించింది.
‘5జీ టెక్నాలజీ కోసం తమ కంపెనీ మొట్టమొదటిసారిగా 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 5జీ ట్రయల్స్‌ను నిర్వహించిన తొలి కంపెనీగా మారిందని’ ఎయిర్‌టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్‌దీప్ సింగ్ అన్నారు. రాబోయే వేలంలో 5జీ స్పెక్ట్రమ్ సరైన ధరకి వస్తే భారత్‌లో అందరికీ బ్రాడ్‌బ్యాండ్ సేవలందించవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ఉపయోగించి 5జీ విస్తరణ ద్వారా నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలు సవాలుగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్‌ను సమర్థవంతంగా అందించేందుకు వీలవుతుందని’ నోకియా వైస్-ప్రెసిడెంట్ నరేష్ అసిజా తెలిపారు.