- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్రెండింగ్‌లో నోయల్ ‘గ్యాంగ్‌స్టర్’
దిశ, వెబ్‌డెస్క్: నోయల్‌సన్..పాపులర్ రాపర్..ప్రజెంట్ బిగ్ బాస్ 4 కంటెస్టెంట్. తెలుగు ఆడియన్స్ ఫేవరేట్ సింగర్, ప్రజెంట్ ఫేవరేట్ కంటెస్టెంట్ కూడా. బిగ్ బాస్ ప్రారంభమై ఐదురోజులు కాక ముందే బిగ్ బాస్‌లో క్లారిటీ ఉన్న ఇంటి సభ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న నోయల్‌కు ఇప్పటికే సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అన్నా..నువ్వే బిగ్ బాస్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా హల్ చల్ చేస్తున్నాయి. మామూలుగా బిగ్ బాస్ విన్నర్ కావాలంటే ప్లానింగ్ పక్కాగా ఉండాలి. ఇంట్లో ఎలా ఉన్నా..? ఎలా బిహేవ్ చేసినా..? బయట పాజిటివ్ టాక్‌తో ఓట్ల వర్షం కురవాలంటే, సూపర్ టాలెంట్ కావాలి. అలాంటి టాలెంట్ నోయల్‌కు ఉందనేది 100 పర్సెంట్ ట్రూ. పైగా గత సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్‌కు సపోర్ట్ చేసి అంత ఫాలోయింగ్ పెంచింది నోయలే. ఫ్రెండ్‌కే అంతలా చేశాడంటే తన విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటాడుగా. అదే పాజిటివ్ రెస్పాన్స్ రావాలని కోరుకుంటాడుగా. అలా రావాలంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలిగా మరి.
హా..ఆ స్పెషలే ‘గ్యాంగ్‌స్టర్’ రాప్ సాంగ్. గురువారం హౌజ్‌లో బిగ్ బాస్ రాప్ సాంగ్‌తో ఆకట్టుకున్న నోయల్..శుక్రవారం బయట ‘గ్యాంగ్‌స్టర్’ రాప్ సాంగ్‌తో రచ్చ చేశాడు. యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోయాడు. బిగ్ బాస్‌లోకి ఎంట్రీకి ముందే నోయల్ కంపోజ్ చేసిన ‘గ్యాంగ్‌స్టర్’ను శుక్రవారం విడుదల చేసింది నోయల్ టీం. లైఫ్‌లో ఎన్ని కష్టాలు పడినా..ఎంత మంది ఇబ్బంది పెట్టినా.. వాటన్నింటికి సమాధానం చెప్తూ..విజయ తీరాలకు చేరినవాడే ‘గ్యాంగ్‌స్టర్’ అనే మెసేజ్‌తో విడుదలైన రాప్ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంది. సూపర్బ్ లిరిక్స్..సూపర్ మ్యూజిక్..సూపర్ ఓకల్స్‌తో రాప్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండగా, మైండ్ బ్లోయింగ్ సాంగ్‌కు ఫిదా అయ్యారు నెటిజనాలు.
https://www.youtube.com/watch?v=ZDwEymnDIdM&feature=youtu.bee
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నోయల్..తాజాగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. చీకట్లో గెలిచినవాడే స్టార్ అని, టర్న్ టు బి ఏ గ్యాంగ్‌స్టర్ అంటూ సాగే లిరిక్స్ తన లైఫ్‌లో ఎదుర్కొన్న అనుభవాలనే లిరిక్స్‌గా మార్చాడని అర్థం అవుతుండగా ఈ మోటివేషనల్ సాంగ్ ఆడియన్స్‌కు కిక్ ఇస్తుంది. ‘‘రాదు కాదు రాదు అంటే ఏదీ అస్సలు రాదు..మురికి నీటిబొట్టున ఉన్న తామర పైకి రానే రాదు..నీ గుండెలో ఉన్న సంకల్పం అది కాల రాతిలో చిరుదీపం..ఆ ధైర్యంతోనే అడుగెయ్ రా..నువ్వు పిడుగై ముందుకు కదిలెయ్ రా..’’ వీ విల్ రాక్ యూ..లాంటి పదాలు చాలా సింపుల్‌గా ఉన్నా మంచి మోటివేషన్ ఇచ్చేలా ఉన్నాయ్ అంటున్నారు ఫ్యాన్స్. అన్నా నీ టాలెంట్..టైమింగ్..అన్నీ కుదిరి నువ్వే గ్యాంగ్‌స్టర్ అయిపోవాలని, బిగ్ బాస్ విన్నర్‌గా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.