- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్మీ సినిమాలు తీయాలంటే.. ఎన్‌వోసీ తప్పనిసరి
వెండితెరపై ఎవర్‌గ్రీన్ సబ్జెక్ట్ ‘ఆర్మీ’ బ్యాక్‌డ్రాప్ సినిమాలు. జోనర్‌కు, హీరోకు సంబంధం లేకుండా ఆర్మీ సినిమా అనగానే.. అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. బార్డర్‌లో మన కోసం పోరాటం చేసే జవాన్ అంటే.. అందరికీ ఎంతో గౌరవం, అభిమానం కూడా. అందుకే అలాంటి పాత్రలు వస్తే చేసేందుకు మన హీరోలు కూడా ఎప్పుడూ ముందుంటారు. యూఆర్ఐ -సర్జికల్ స్ట్రైక్ సినిమా భారీ హిట్ సాధించడంతో ఇటీవల కాలంలో.. ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌ల సంఖ్య పెరిగింది. అయితే, ఆర్మీ అనగానే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. క్రమశిక్షణ లేకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటారు. మరి అలాంటిది ఆర్మీ నేపథ్యంలో సినిమాలు తీస్తే, సదరు సినిమా యూనిట్ వాళ్లు ఇంకెత్త జాగ్రత్తగా తీయాలి. కానీ కొన్ని సినిమాల్లో ఇండియన్ ఆర్మీ గురించి తప్పుగా చూపించడంతో పాటు తక్కువ చేసి చూపిస్తున్నారని చాలా విమర్శలొస్తున్నాయి. దాంతో ఇండియన్ ఆర్మీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో ఏ ఇండస్ట్రీ వాళ్లు సినిమాలు గానీ, వెబ్ సిరీస్‌లు గానీ తీసినా.. కచ్చితంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ (ఎన్‌వోసీ) సర్టిఫికెట్‌ను తీసుకోవాలి. ముందే స్టోరీ చెప్పి ఎన్ఓసీ తీసుకోవడంతో పాటు విడుదల సమయంలోనూ రక్షణ శాఖకు ఆ సీన్స్ చూపించిన తర్వాతే సదరు సినిమా లేదా వెబ్ సిరీస్‌లను విడుదల చేయాలని ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్ఓసీ లేని సినిమాలకు ఇకపై సెన్సార్ సర్టిఫికెట్ కూడా ఇవ్వకూడదంటూ కేంద్ర నిర్ణయించింది.