- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నో షేక్ హ్యాండ్.. ఓన్లీ నమస్తే!
దిశ, వెబ్ డెస్క్: కరోనా నేపథ్యంలో అగ్రరాజ్యాల అధినేతలు తమ పద్ధతులను మార్చుకున్నారనే తెలుస్తోంది. ఇన్ని రోజులు ఎవరినైనా కలుసుకుంటే ముందుగా షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించుకునేవారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ‘షేక్ హ్యాండ్’కు స్వస్తి పలికి ‘నమస్తే’కు ప్రియారిటీ ఇస్తున్నారు. ఏదేమైనా ఇన్నిరోజులు ఇండియన్స్ ఫారిన్ కల్చర్ అలవాటు చేసుకుంటే.. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారతీయ సాంప్రదాయాన్ని అలవర్చుకుంటున్నాయనడంలో సందేహం వలదు.
Willkommen im Fort de Brégançon, liebe Angela! pic.twitter.com/lv8yKm6wWV
— Emmanuel Macron (@EmmanuelMacron) August 20, 2020
తాజాగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కలుసుకున్నప్పుడు చేతులు జోడించి నమస్కారం చెప్పుకున్నారు. మెర్కెల్‌ను స్వాగతిస్తున్నప్పుడు ఇద్దరు నేతలూ నమస్కారం చెప్పుకున్న వీడియోను మాక్రాన్ ట్వీట్ చేశారు. ఎన్నోఎండ్లుగా వస్తున్న షేక్ హ్యాండ్ సాంప్రదాయానికి వీరు స్వస్తి పలికినట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారతీయ పద్ధతిని అలవరచుకున్నారు. నమస్కారం చెబుతూ అందరినీ విష్ చేస్తున్నారు. షేక్‌హ్యాండ్‌కు అలవాటుపడిన భారత నేతలు, ప్రజలు కూడా ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి చెప్పేస్తున్నారు.