- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్రదేశంలో మీడియాకు అనుమతి లేదు!
దిశ, వెబ్‌డెస్క్ :
సచివాలయం కూల్చివేతల వద్దకు మీడియాకు అనుమతి ఇవ్వలేమని తెలంగాణా ప్రభుత్వం తేల్చిచెప్పింది. అయితే, కూల్చివేత ప్రసారానికి మీడియాను అనుమతివ్వాలని దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు శుక్రవారం విచారించింది. మీడియాకు ఎందుకు అనుమతి ఇవ్వరో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ బులిటెన్ మాదిరిగా కూల్చివేతలకు సంబంధించిన బులిటెన్ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. తమకు ప్రత్యక్ష ప్రసారాలు చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.
ఆర్టికల్ 90 ప్రకారం మీడియా స్వేచ్చకు ప్రభుత్వం ఆటంకం కలిగిస్తుందన్న పిటిషనర్ వాదించారు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ప్రకారం ఇది మీడియాకు పూర్తి స్వేచ్చ విఘాతం కల్పిస్తుందన్నారు. పరిస్థితుల ప్రభావం వలన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు వివరించారు. ఈ కేసులో చట్ట ప్రకారం ఎలాంటి అర్హత లేదన్నారు ఏజీ వాదించగా, ఎందుకు లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సచివాలయ పరిసర ప్రాంతాలలో కవరేజ్ అడ్డుకున్నారు ఒకే.. ప్రయివేటు ప్రాంతాల్లో కవరేజ్ చేస్తున్నా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
ఇకమీదట ప్రయివేటు ప్రాంతాల్లో కవరేజ్ చేస్తున్న మీడియాను అడ్డుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిజాం నిధి ఉందని జాతీయ మీడియాలో వస్తుందని, అది నిజమో లేదో తెలియాల్సిన అవసరం ఉందని పిటీషనర్ కోర్టును కోరారు. దీంతో ప్రభుత్వం ఎందుకు ఇంత రహస్యంగా పనులు చేపడుతుందని హైకోర్టు ప్రశ్నించింది. అనంత పద్మనాభ స్వామి దేవాలయంకి సంబంధించి రూ. కోట్ల సంపదను లైవ్ లో చూపించిన మీడియాను.. ఇప్పుడు ఎందుకు కట్టడి చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వం అనుమతి ఇస్తుందని అనుకున్నామన్న హైకోర్టు, అనుమతి ఇవ్వక పోవడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని వెల్లడించింది. కాగా, పిటిషన్ పై ప్రభుత్వ నిర్ణయం అనంతరం తుది తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు చెబుతూనే.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.