రోడ్లపై వలస కార్మికుల్లేనే లేరు: సుప్రీంకు కేంద్రం

by Shamantha N |
రోడ్లపై వలస కార్మికుల్లేనే లేరు: సుప్రీంకు కేంద్రం
X

న్యూఢిల్లీ : మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రోడ్లపై ఒక్క వలస కార్మికుడు కూడా లేడని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. వారినందరిని సమీప షెల్టర్లలలోకి తరలించినట్టు వివరించింది. లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులకు ఆశ్రయం, ఆహారం అందించడంపై మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో వేరు వేరుగా రెండు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. పిటిషన్ లో లేవనెత్తిన అంశాలపై కేంద్రం స్పందించాల సోమవారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే

6.6. లక్షల మందికి ఆశ్రయం :

షెల్టర్లలోని వలస కార్మికులందరికీ ఆహారం, నీరు, మెడిసిన్స్, పడకల వసతి కల్పించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. వీటితోపాటు వారిలో ఎవరికైనా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించాలని, ఎవరైనా బాధితులు ఉంటే వైద్యం అందించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్రం తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అందుకనుగుణంగా ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసిందని వివరించారు. కేంద్రం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 6.6 లక్షల మంది( వలస కార్మికులు సహా) తాత్కాలిక ఆశ్రయాలలో ఉన్నట్టు చెప్పారు. 22.88 లక్షల మందికి ఆహారాన్ని అందిస్తున్నట్లు వివరించారు

మత బోధకులతో కౌన్సిలింగ్..

వైరస్ కన్నా భయం పెద్ద సమస్యని సీజేఐ సోమవారం వ్యాఖ్యానించిన విషయం విదితమే. కరోనా పట్ల కార్మికుల్లో నెలకొన్న ఆందోళనను పారదోలేందుకు మత పెద్దలు, సుశిక్షితులైన కౌన్సిలర్ లతో కౌన్సిలింగ్ ఇప్పించాలని, అవసరమైతే భజనలు, నమాజులను నిర్వహించాలని కోర్టు సూచించింది. మీడియాతో తరచూ సంభాషిస్తూ నకిలీ వార్తలకు చెక్ పెట్టాలని అని తెలిపింది. దీనికి సొలిసిటర్ స్పందిస్తూ 24 గంటల్లో శిక్షణ పొందిన కౌన్సిలర్లు, మత పెద్దలతో వలస కార్మికులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామని తెలిపారు. మత బోధకులు, మౌల్వీలు, సాధువులను ఇందుకు పురమాయిస్తామని వివరించారు.

Tags: Supreme Court, centre, lockdown, migrant workers, exodus, shelter, counseling

Advertisement

Next Story

Most Viewed