'ఎన్ఐఏ దర్యాప్తుపై అభ్యంతరం లేదు'

by Shamantha N |   ( Updated:2020-02-13 07:13:13.0  )
ఎన్ఐఏ దర్యాప్తుపై అభ్యంతరం లేదు
X

‘భీమా కోరెగావ్’ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేయడం పై తమకేమీ అభ్యంతరం లేదని మహారాష్ట్ర సర్కారు తెలిపింది. గత నెల ఈ కేసు పూణే పోలీసుల నుంచి ఎన్ఐఏకు బదిలీ అయిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే కేంద్రం.. ఈ కేసును బదిలీ చేసిందని శివసేన పార్టీ కారాలు మిరియాలు నూరింది. కాగా, ఎన్ఐఏ ఈ కేసును బదిలీ చేసుకోవడం పై రాష్ట్ర హోం శాఖకు ఎటువంటి అభ్యంతరాల్లేవని అదనపు చీఫ్ సెక్రెటరీ(హోం) సంజయ్ కుమార్ గురువారం తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేస్తూ కార్యకర్తలు సుధీర్ దావలే , రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, షోమా సేన్, అరుణ్ ఫరేరా, వెర్నాన్ గొంజాల్వేస్, సుధా భరద్వాజ్, వరవర రావులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే.

Advertisement

Next Story