పుడ్ కోర్టుకు తక్కువ కాదు…ఐదు రూపాయల భోజనం

by Sridhar Babu |
5-rupess,
X

దిశ, కూకట్​పల్లి: జీహెచ్‌ఎంసీ అందిస్తున్న అన్నపూర్ణ ఐదు రూపాయల భోజన కేంద్రాన్ని అన్ని హంగులతో అందుబాటులోకి తీసుకు వస్తున్నారు కూకట్​పల్లి జోన్​అధికారులు. పేద ప్రజలు, బాట సారుల ఆకలిని తీర్చడానికి జీహెచ్​ఎంసీ, హరేరామ హరికృష్ణ సంస్థ సౌజన్యంతో అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేసి కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనాన్ని అందిస్తుంది. రహదారులపై కూడళ్లలో ఉన్న అన్నపూర్ణ కేంద్రాల వద్దకు వచ్చే వారు రోడ్లపైనే నిలుచుని భోజనం చేస్తుంటారు.

5-rupees-2

కానీ కూకట్​పల్లిలో వీటికి భిన్నంగా ఫుడ్‌స్టాల్‌లను పోలిన అన్నపూర్ణ క్యాంటిన్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. జోనల్ కమిషనర్ మమత ప్రత్యేక చొరవతో కూకట్‌పల్లి జోనల్​కార్యాలయం ఎదురుగా ఉన్న అన్నపూర్ణ ఐదు రూపాయల భోజన కేంద్రం వద్ద ఖాళీ స్థలంలో 7.5 లక్షల వ్యయంతో ప్రత్యేక షెడ్​ ఏర్పాటు చేసి క్యాంటిన్ నిర్మించారు.

ఫుడ్​ కోర్టులకు ఎందులోను తీసి పోని విధంగా రంగు రంగుల అలంకరణలతో, డిజైనర్​ విద్యుత్​ దీపాలతో డైనింగ్‌హాల్‌ను తయారు చేశారు. భోజనం చేయడానికి వచ్చిన వారు డైనింగ్ హాల్​లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న బల్లలపై ప్లేట్లు​ పెట్టుకుని భుజించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చేతులు కడుక్కోవడానికి వాష్​ బేసిన్​, తాగడానికి తాగు నీటిని ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆకలిని తీర్చడమే కాకుండా, వారు భోజనం చేయడానికి అనువైన స్థలాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్న జీహెచ్​ఎంసీ కూకట్​పల్లి జోన్​ అధికారులను స్థానికులు అభినందిస్తున్నారు.

త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తాం: డి. గోవర్ధన్​ గౌడ్, ఈఈ, కూకట్​పల్లి సర్కిల్

de,

జోనల్​ కమిషనర్​ మమత చొరవతో అన్నపూర్ణ కేంద్రానికి వచ్చే వారు భోజనం చేయడానికి ప్రత్యేకంగా డైనింగ్​ హాల్​ను ఏర్పాటు చేస్తున్నాం. 7.5 లక్షల వ్యయంతో అన్నపూర్ణ క్యాంటిన్​ను ఏర్పాటు చేసి ఫుడ్​ కోర్టులను తలపించే విధంగా తయారు చేస్తున్నాం. త్వరలో అన్నపూర్ణ క్యాంటిన్​ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Advertisement

Next Story

Most Viewed