85 ఏళ్లుగా సాగిన ఉత్సవాలు ఇప్పుడు లేవు

by Shamantha N |   ( Updated:2020-07-01 11:19:45.0  )
85 ఏళ్లుగా సాగిన ఉత్సవాలు ఇప్పుడు లేవు
X

ముంబయి: హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం ఎలాగో.. ముంబయికి లాల్‌బాగ్చా రాజా(మహాగణపతి) అలాగే. 15 అడుగులకు తక్కువ కాకుండా ఈ విగ్రహం ఎత్తు మెయింటెయిన్ చేసే ఈ విఘ్నేశ్వరుడిని ప్రతియేటా సుమారు 15 లక్షల మంది దర్శించుకుంటారని అంచనా. ఇక్కడ గణేష్ మహోత్సవానికి ప్రముఖ రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు అంతా లాల్‌బాగ్చా రాజా దగ్గర క్యూ కడతారు. ప్రతియేటా అంతకంతకు అదిరిపోయే రేంజ్‌లో ఇక్కడ ఉత్సవాలను జరుపుతుంటారు. అందుకే లాల్‌బాగ్చా వినాయకుడికి అంత క్రేజ్ ఉంటుంది.

అంత ప్రసిద్ధి చెందిన లాల్ బాగ్చా రాజా విగ్రహాన్ని ఈ సారి పెట్టట్లేదన్న విషయం చాలా మందిని నిరూత్సహపరుస్తున్నది. కరోనా మహమ్మారి మహారాష్ట్రలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 85ఏళ్లపాటు నిరాటంకంగా సాగిన ఈ ఉత్సవాలు ఈ సారి చిన్నబోనున్నాయి. సాంప్రదాయ పూజలు నిర్వహించటాని కోసం 3-4 అడుగుల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతియేటా నిర్వహించే గణేష్ మహోత్సవాలను ఈ సారి ఆరోగ్యోత్సవ్‌గా మార్పు చేసినట్టు లాల్‌బగ్చా రాజా సార్వజనిక్ గణేషోత్సవ్ మండల్ ప్రతినిధి తెలిపారు. 11 రోజులపాటు బ్లడ్, ప్లాస్మా డొనేషన్ క్యాంపులు నిర్వహించనున్నట్టు వివరించారు. రూ. 25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళమిస్తారని, అలాగే, గాల్వన్ ఘర్షణల్లో మరణించిన వీరజవాన్ల కుటుంబాలకు సహాయమందిస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed