- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రీడా అవార్డులకు వాళ్లు అనర్హులు..
దిశ, స్పోర్ట్స్: క్రీడా అవార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. డోపింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి ఈ ఏడాది ఖేల్ రత్న, అర్జున అవార్డులు ఇవ్వకూడదని కేంద్ర క్రీడా శాఖ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఈ అవార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్నారు. గతంలో డోపింగ్ ఆరోపణలు ఎదుర్కునే అథ్లెట్లకు క్రీడా అవార్డులు ఇవ్వడానికి పెద్దగా ఆంక్షలు ఉండేవి కావు. ఆరోపణలు వచ్చినా.. కాస్త సమయం తీసుకొని వారికి అవార్డులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం డోపింగ్ ఆరోపణలు ఉన్న అథ్లెట్లకు అవార్డులు ఇవ్వకూడదంటూ క్రీడా శాఖ నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును ఈ ఏడాదే ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నగా మార్చింది. నోటిఫికేషన్ ప్రకారమే అవార్డుల ప్రదానం జరుగుతుందని కూడా చెప్పింది. కాగా, డోపింగ్ ఆరోపణలు ఎదుర్కున్న అథ్లెట్ల నిషేధం ముగిసిన తర్వాత మాత్రమే క్రీడా అవార్డులు ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఖేల్ రత్న కోసం బాక్సర్ అమిత్ పంగల్, అర్జున అవార్డు కోసం ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు. కొత్త నిబంధన మేరకు వీరిద్దరూ క్రీడా అవార్డులకు అనర్హులని క్రీడా శాఖ స్పష్టం చేసింది.