- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్టోబర్‌లో వాహన విక్రయాలు డీలా
దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ నెలకు సంబంధించి ప్యాసింజర్ వాహనాలు 9 శాతం క్షీణించగా, టూ-వీలర్ వాహనాలు 27 శాతం తగ్గాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తెలిపింది. ఈ గణాంకాలు దేశీయంగా ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సూచిస్తున్నాయని అసోసియేషన్ బాడీ వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌లో మొత్తం 2,73,980 యూనిట్లు విక్రయించగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 2,49,860 యూనిట్లకు పరిమితమయ్యాయని పేర్కొంది.
టూ-వీలర్ విక్రయాలు కూడా 26.82 శాతం తగ్గాయని, గతేడాది 14,23,394 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 10,41,682 యూనిట్లకు తగ్గాయని తెలిపింది. కమర్షియల్ వాహనాలు కూడా 30.32 శాతం తగ్గిపోయి నిరాశపరిచాయి. త్రీ-వీలర్ విక్రయాలు సైతం 64.5 శాతం క్షీణించినట్టు ఎఫ్ఏడీఏ (FADA)పేర్కొంది. పండుగ సీజన్‌లో డిమాండ్‌ను తీర్చేందుకు తయారీదారులు సాధారణంగా దీపావళికి ముందు నెలలో ఎక్కువ వాహనాలను ఉత్పత్తి చేస్తారు.
అక్టోబర్‌లో నెలవారీ ప్రాతిపదికన విక్రయాలు పెరిగినప్పటికీ, వార్షిక ప్రాతిపదికన ప్రతికూలంగానే నమోదయ్యాయని’ ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు వింకేష్ గులాటి చెప్పారు. అయితే, ఈ వాహనాలకు భిన్నంగా ట్రాక్టర్ విక్రయాలు 55 శాతం వృద్ధిని సాధించాయి. మొత్తం వాహనాల ప్రాతిపదికన చూడగా, అక్టోబర్‌లో 23.99 శాతం క్షీణత నమోదైంది. యూనిట్ల పరంగా గతేడాది 18,59,709 యూఇట్లు విక్రయించగా, ఈసారి 14,13,549 యూనిట్లకు పడిపోయాయి. కరోనా సంక్షోభం వల్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో డిమాండ్‌కు తగినంతగా సరఫరా జరగలేదని వింకేష్ తెలిపారు.