ఇప్పటికేం ఢోకా లేదు!

by Harish |   ( Updated:2020-02-19 01:58:08.0  )
ఇప్పటికేం ఢోకా లేదు!
X

కోవిడ్-19(కరోనా వైరస్) కారణంగా ఇప్పటివరకూ ధరల పెరుగుదలకు సంబంధించి ఎటువంటి ఆందోళనలు లేవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మేక్ ఇన్ ఇండియాపై కరోనా వైరస్ ప్రభావం ఉందని మాట్లాడుకోవడం తొందరపాటు చర్య అని ఆమె స్పష్టం చేశారు. దేశీయ పరిశ్రమపై వైరస్ ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలను త్వరలో ప్రభుత్వం ప్రకటించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ముడి పదార్థాలు అందుబాటులో ఉన్నందున ఇంకా సంక్షోభ పరిస్థితులు లేవని విలేకరుల సమావేశంలో చర్చించారు.

చైనాలో విజృంభిస్తున్న వైరస్ గురించి పరిస్థితిని సమీక్షించేందుకు పరిశ్రమ ప్రతినిధులను కలిసిన ఆర్థిక మంత్రి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. బుధవారం వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమై, ఆ తర్వాత ప్రధాని కార్యాలయంతో సంప్రదించి పరిస్థితిని చక్కదిద్దే చర్యలను ప్రకటిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. మందులు, వైద్య పరికరాల కొరత గురించి ఎటువంటి నివేదికలు అందలేదని, బదులుగా ఫార్మా పరిశ్రమ కొన్ని రకాల వస్తువుల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అడుగుతున్నారని తెలిపారు. ఈ అంశంపై సమావేశంలో పాల్గొన్న ప్రతినిధి.. ఏదేమైనా సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడుతుంది. ఫార్మా, సౌర, రసాయన పరిశ్రమల విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు.

మార్కెట్ల నష్టాలకు బ్రేక్!

Advertisement

Next Story

Most Viewed