- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
చేతులు లేకున్నా స్నూకర్!
దిశ, వెబ్‌డెస్క్: వైకల్యం ఉన్నప్పటికీ వివిధ రంగాల్లో ఉన్నత విజయాలు సాధించిన వారినెందరినో చూశాం. అయితే అవి వైకల్యం గల వారి శరీర భాగంతో కాకుండా బాగా పనిచేసే ఇతర శరీర భాగాలతో సాధించినవై ఉంటాయి. అంటే చేతులు లేకపోతే కాలితో, నోటితో పనులు చేయడం, కాళ్లు లేకపోతే చేతుల సాయంతో నడవగలడం లాంటివన్నమాట. అయితే క్రీడల్లో రాణించాలంటే మాత్రం సంబంధిత క్రీడకు అవసరమైన అవయవం కచ్చితంగా అవసరం అవుతుంది. ఇప్పుడు ఫుట్‌బాల్‌ను చేతితో ఆడటం, హ్యాండ్‌బాల్‌ను కాలితో ఆడటం కుదరదు కదా! కానీ పుట్టుకతోనే రెండు చేతులూ లేని పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం సంకల్పం ఉంటే క్రీడల్లో కూడా వైకల్యం ఉన్నవారికి కొత్తదారి దొరుకుతుందని నిరూపించాడు.
పంజాబ్ ప్రావిన్స్‌లోని సముంద్రి పట్టణానికి చెందిన మహ్మద్ ఇక్రమ్. వయస్సు 32 ఏళ్లు. పుట్టుకతోనే అతనికి భుజాల వరకు చేతులు లేవు. కానీ స్నూకర్ ఆడగలుగుతాడు. స్నూకర్ గేమ్‌లో స్టిక్‌తో బంతులను కొట్టాలి. కానీ వైకల్యం ఉన్న ఇక్రమ్ మరి స్నూకర్ ఎలా గలుగుతాడు? తన చుబుకంతో (దవడ బయటివైపు కొన) స్నూకర్ బంతులను ఇక్రమ్ కొట్టగలడు. ఇలా బలంగా బంతులను కొట్టి, వేరే బంతులను పడేయడానికి అతను దాదాపు 8 ఏళ్ల ప్రాక్టీస్ చేశాడు. స్నూకర్‌లో అతని ప్రతిభ చూసి ఎందరో దిగ్గజ ఆటగాళ్లు ఇక్రమ్‌ను మెచ్చుకున్నారు. అంతేకాదు స్థానికంగా ఉన్న క్లబ్‌లలో జరిగే స్నూకర్ పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నాడు. ఎప్పటికైనా పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో స్నూకర్ పోటీల్లో పాల్గొని దేశానికి పేరు తీసుకురావడమే తన కల అని ఇక్రమ్ చెప్పారు. పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి ఇక్రమ్ మరొక ఉదాహరణ!