- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రెడ్ క్రాస్‌కు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
by Shyam |

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్:
జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ కు నిజామాబాద్ రెడ్ క్రాస్ ఎంపికైంది. నిజామాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి చైర్మన్ డాక్టర్ నీలి రామచందర్ అధ్వర్యంలో రెండు దశాబ్దాలుగా చేపట్టిన సేవ కార్యక్రమాలకు 2017-18 సంవత్సరానికి గాను నేషనల్ హెడ్ క్వార్టర్ వారి జాతీయ స్థాయి ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్ కు ఎంపికైంది. జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ లో నీలి రామచంధర్ కు జిల్లా పాలనాధికారి, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు సి నారాయణ రెడ్డి పుష్ప గుచ్చాన్ని అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ బంగారు పతకాన్ని జాతీయ స్థాయిలో జరిగే రెడ్ క్రాస్ వార్షిక వేడుకల్లో భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ నెల 15 న ప్రధానం చేయనున్నారని జిల్లా సెక్రటరీ బుస్స ఆంజనేయులు తెలిపారు.
Next Story