బాలాపూర్ ఉత్సవ కమిటీకి కేసీఆర్ డబ్బులివ్వాలి

by Shyam |
బాలాపూర్ ఉత్సవ కమిటీకి కేసీఆర్ డబ్బులివ్వాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దేశంలోనే ఎంతో గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూను సీఎం కేసీఆర్ ఫ్రీగా తీసుకోవడం ఏం బాలేదని, దయచేసి వారికి డబ్బులు చెల్లించాలని, లేకుంటే సీఎం ఆరోగ్యం బాగుండదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బాలాపూర్ లడ్డూ గత సంవత్సరం రూ.15 లక్షలకు పైగా ధర పలికిందని, కరోనా కారణంగా దానికి వేలం వేయకుండా ఉత్సవ కమిటీ సీఎం కేసీఆర్‌కు అందజేశారని తెలిపారు.

రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, ప్రజలు కోవిడ్-19తో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. దేశంలోని 32 రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ యూస్ చేసుకుంటున్నాయని, నాలుగు రాష్ట్రాలు మాత్రమే యూస్ చేసుకోవడం లేదని, అందులో తెలంగాణ కూడా ఉందన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అవినీతి వెనుక కేటీఆర్ ఉన్నాడని ఎంపీ ఆరోపించారు. సీఎం కేసీఆర్ గ్రామాల్లో నిర్మించబోతున్న వ్యవసాయ క్షేత్రాలను, నియోజకవర్గాల వారీగా బస్‌లు పెట్టి రైతులకు చూపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం మద్ధతు ధర ఇచ్చి మక్కలు కోనుగోలు చేస్తుందని తెలిపారు.

Advertisement

Next Story