- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైస్ మిల్లర్ల దోపిడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన దీక్ష
దిశ, నిజామాబాద్: ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల దోపిడీని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. పట్టణంలోని కాంగ్రెస్ భవన్‌లో మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి నేతలు దీక్ష చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శులు మహేష్ కుమార్ గౌడ్, గడుగు గంగాధర్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి దీక్షలో కూర్చుకున్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. రైతులను మిల్లర్లు మోసం చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కైందని ఆరోపించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఇంచార్జ్ తాహెర్ భీన్ హందాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణు, అనుబంధ విభాగాల అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: congress leaders, protest, nizamabad, ts