- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిజామాబాద్ కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీగా పొగలు కమ్ముకోవడంతో ఆసుపత్రిలో ఉన్న రోగులు, వారి సహాయకులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో అత్యంత విలువైన సిటీ స్కానింగ్ యంత్రం దగ్దమైంది. సిటీ స్కానింగ్ విలువ కోటి వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. సిటీ స్కానింగ్ అగ్ని ప్రమాదం లో దగ్ధం కావడం తో కొవిడ్ ఆసుపత్రి లో కొవిడ్ రోగులకు పరీక్షల నిర్వహణ ఇబ్బంది కరంగా మారిందని వైద్యాధికారులు పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రి లో ప్రస్తుతం 426మంది పాజిటివ్ వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకుని పోలీసులు కూడా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.