వాహనదారులకు నిజామాబాద్ కలెక్టర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్స్

by Shyam |   ( Updated:2021-11-21 06:54:49.0  )
Nizamabad Collector Narayana Reddy
X

దిశ, నిజామాబాద్ సిటీ: యునైటెడ్ నేషన్స్ వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్-2021 సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించిన వాహనదారులకు నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి ఉచిత బహుమతులు అందించారు. ఆదివారం ఈ సందర్భంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనదారులందరూ చట్టం పట్ల విధేయతతో ఉండాలని, ఇతర వాహనదారులను గౌరవించాలని కోరారు. ఈ సందర్భంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించిన వాహనదారునికి కలెక్టర్ రోడ్ సేఫ్టీ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లను అందించారు. మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరిగాయని సూచించారు.

వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పి. జగన్ మోహన్ రెడ్డి, రావుల సుభాష్, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ స్వాతి, విశాల్ రెడ్డి, ప్రీతిరెడ్డి, జ్యోతి, ఓం నాగ్లా జీ, ఘన్‌షామ్ ఓజా(వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ & సీఈవో ఐవైఎస్‌వో టీమ్ ఇండియా, సేఫ్ ఇండియన్ రోడ్స్, యాక్టు ఇండియా & యంగ్ ఇండియా మిషన్), రావుల సాయిచంద్ర, సురభి నాగ్లా, సుమీరన్ నాగ్లా, రక్షంద ఓజా పాల్గొన్నారు.

Advertisement

Next Story