ఉపాధి పనుల్లో సామాజిక దూరం పాటించాలి

by  |   ( Updated:2020-04-24 06:49:54.0  )
ఉపాధి పనుల్లో సామాజిక దూరం పాటించాలి
X

దిశ, నిజామాబాద్: ఉపాధి పనుల్లో కూలీలందరూ సామాజిక దూరం పాటిస్తూ పనిచేయాలని నిజామాబాద్ కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలకు మాస్కులు పంచారు. అనంతరం మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ కోసం కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని తెలిపారు. పనులు జరిగే చోట శానిటైజర్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పని సమయం గురించి కూలీలను ఆరా తీయగా ఉదయం 7 నుంచి 11 గంటల వరకు అనువుగా ఉంటుందని కలెక్టర్‌తో తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న రూ . 1500, బియ్యం అందాయా? లేదా అని తెలుసుకున్నారు. అనంతరం డిచ్‌పల్లి సీఎంసీ సెంటర్‌ను సందర్శించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో సురేష్ కుమార్, తహసీల్దార్ వేణుగోపాల్ గౌడ్, ఎంపీపీ గద్దె భూమన్న, ఏపీడీ శ్రీనివాస్, ఏపీఓ మంజుల తదితరులు పాల్గొన్నారు.

Tags: Nizamabad, collector, C.Narayanreddy, Inspect, Tu, workers

Advertisement

Next Story

Most Viewed