- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రోన్ కెమెరాల నిఘాలో నిజామాబాద్
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున సీపీ కార్తీకేయ ఆదేశాల మేరకు ఏసీపీ శ్రీనివాస్ కుమార్ నిరంతరం డ్రోన్ కెమెరాల ద్వారా లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు. గురువారం నగరంలోని కంటైన్‌మెంట్ జోన్ ప్రాంతాలైన గోల్డెన్ జూబ్లీ, ఖిల్లా రోడ్, ఆటోనగర్ , అక్బర్ బాగ్, ఎల్లమ్మ గుట్ట తదితర కాలనీల్లో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ప్రజలు, వాహనదారులు భౌతిక దూరం ఏ విధంగా పాటిస్తున్నారో పరిశీలించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ బోధన్ డివిజన్‌లోని కంటైన్‌మెంట్ క్లస్టర్లలో డ్రోన్ ద్వారా ప్రజల రాకపోకలపై నిఘా పెట్టామన్నారు. ఆర్మూర్ పట్టణంలో కూడా తొలిసారిగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించి లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంనకు డ్రోన్లను అనుసంధానం చేసి ప్రజల రాకపోకలను అదుపు చేస్తున్నట్టు సీపీ వివరించారు. ఎవరైనా ఒక దగ్గర గుమిగూడితే వెంటనే గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. సరైన కారణం లేకుండా ద్విచక్ర వాహనాలతో రోడ్లపై తిరిగే వ్యక్తులను గుర్తించి వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించడమే కాకుండా, పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలను పాటించాలని కోరారు.
Tags: carona, lockdown, drone cameras, focus on city, nizamabad