నితిన్ పాన్ ఇండియా మూవీ… కీలక పాత్రలో కీర్తి, సత్యదేవ్

by Shyam |
నితిన్ పాన్ ఇండియా మూవీ… కీలక పాత్రలో కీర్తి, సత్యదేవ్
X

యంగ్ హీరో నితిన్ ఈ మధ్య భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాడు. రష్మిక మందనాతో జోడీ కట్టి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే వెంటనే హిందీ చిత్రం అంధాదున్ రీమేక్ సినిమా లాంచ్ చేశాడు. అంతకు ముందే కీర్తి సురేష్ తో రంగ్ దే సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసిన నితిన్… ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ మరో చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు చల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా… పవర్ పేట గా మూవీ టైటిల్ ఖరారు చేశారు. విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న నటుడు సత్యదేవ్ ఈ సినిమాలో నితిన్ కు సోదరుడిగా కనిపించనున్నాడు. కాగా ఇది నితిన్ కు తొలి పాన్ ఇండియా మూవీ.

కమిట్ అయినా అన్ని సినిమాలు హిట్ అయితే నితిన్ కెరీర్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్తున్నారు విశ్లేషకులు. వరుస హిట్లతో దూసుకుపోతే లవర్ బాయ్ ఇమేజ్ కాస్త స్టార్ హీరో రేంజ్ దక్కుతుందని అభిప్రాయ పడుతున్నారు. ఇక శాలినితో నిశ్చితార్థం నితిన్ కు కలిసొస్తుందని… ఖచ్చితంగా స్టార్ హీరో అవుతాడని అంటున్నారు ఫ్యాన్స్. తమ హీరో పాన్ ఇండియా మూవీ చేయడం చాలా హ్యాపీ గా ఉందని చెప్తున్నారు.

Tags: Nithin, Bheeshma, Rang de, Power peta, Keerthi Suresh

Advertisement

Next Story