భారత్‌లో విస్తరణ ప్రణాళికలు : నిస్సాన్ ఇండియా

by Harish |
భారత్‌లో విస్తరణ ప్రణాళికలు : నిస్సాన్ ఇండియా
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో డీలర్‌షిప్‌లతో పాటు, సర్వీస్ స్టెషన్‌ల నెట్‌వర్క్‌లను విస్తరించనున్నట్టు నిస్సాన్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. అంతేకాకుండా, కొత్త 20 విక్రయ కేంద్రాలను, 30 సర్వీస్ ఔట్‌లెట్లను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో మరింత స్థిరంగా నిలదొక్కుకోవడంతో పాటు వృద్ధిని సాధించాలనే వ్యూహంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. డిసెంబర్ తొలి వారంలో కంపెనీనికి చెందిన బీ సెగ్మెంట్ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నెట్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు, ఈ సందర్భంగా దేశీయంగా విస్తరణ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించింది.

కొత్త విక్రయ కేంద్రాలను పెంచడం, సంస్థ విస్తరణ ద్వారా భారతీయ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించగలం. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు డిజిటల్ ఎకో సిస్టమ్‌ను సైతం సిద్ధం చేస్తున్నామని’ నిస్సాన్ ఇండియా ఎండీ రాకేష్ శ్రీవాస్తవ చెప్పారు. ‘దేశీయ వినియోగదారుల కోసం నిస్సాన్ ఇండియా మరిన్ని ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు ప్రయత్నంలో ఉందని, దీనికోసం మరిన్ని మార్పులను తీసుకురానున్నట్టు’ నిస్సాన్ మోటార్ ఇండియా ప్రెసిడెంట్ తెలిపారు.

Advertisement

Next Story