చరిత్ర సృష్టించిన ‘నిశ్శబ్దం’

by Jakkula Samataha |
చరిత్ర సృష్టించిన ‘నిశ్శబ్దం’
X

నిశ్శబ్దం.. సైలెంట్‌గా వస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద వయలెన్స్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతోంది. లాక్‌డౌన్ తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న తొలి చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని రికార్డులు సృష్టించేందుకు సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది మూవీ యూనిట్. కాగా అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల తర్వాత లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. సినిమాలో మూగ అమ్మాయిగా కనిపించబోతున్న స్వీటీ.. తన మౌనంతోనే సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా U/A సర్టిఫికెట్ పొందగా.. కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. సినిమా గురించి సెన్సార్ బోర్డు సభ్యులు ఇచ్చిన కాంప్లిమెంట్స్‌తో ఆనందంగా ఉందన్న హేమంత్.. థియేటర్‌లోనే సినిమా రిలీజ్ చేయాలన్న వారి సలహాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క సరసన ఎవర్ గ్రీన్ హీరో మాధవన్ నటిస్తుండగా.. అంజలి, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించాయి. గోపి సుందర్ మ్యూజిక్ అందించగా.. శానియల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.

Advertisement

Next Story