- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అలర్ట్.. ముంబయి, గుజరాత్‌లకు రేపు తుఫాన్ ముప్పు
న్యూఢిల్లీ: కరోనా కేసులతో సతమతమవుతున్న ఆర్థిక రాజధాని ముంబయి మరో ముప్పును ఎదుర్కోబోతున్నది. ఈ శతాబ్దంలో తొలిసారిగా తుఫాన్ తాకిడికి గురికానున్నది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం నిసర్గ తుఫాన్‌గా పరిణమించిన సంగతి తెలిసిందే. ఇదే మరింత తీవ్రరూపం దాల్చి ముంబయి మహానగరాన్ని ముంచెత్తనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్ర తీరంలో ఆరు ఫీట్ల ఎత్తుతో అలలు వచ్చే అవకాశముందని తెలిపింది. దీంతో ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 150 మంది కరోనా పేషెంట్లు సహా 1,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్(హరిహరేశ్వర్ మరియు డామన్ నుంచి మహారాష్ట్ర రాయిగడ్ జిల్లాలోని అలీబాగ్ సమీపంగా)ల తీరప్రాంతాల నుంచి బుధవారం మధ్యాహ్నం ఈ తుఫాన్ గంటకు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో ప్రవేశించనున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ముంబయి చుట్టుపక్కల్లోని సబ్అర్బన్ సిటీల్లో హై అలర్ట్ ప్రకటించారు. దాదాపు 30 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ముందస్తుగానే ఈ రెండు రాష్ట్రాల్లో రంగంలోకి దిగాయి. ఈ తుఫాన్ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ముంబయి వాసులు రెండు రోజులు ఇంటికే పరిమితం కావాలని, బయటికి రావొద్దని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. కాగా, తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రతగా ఉండాలని, తుఫాన్ సహాయక చర్యల కోసం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.