- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్ తో 'పంచాయతీ' పెట్టనున్న నిమ్మగడ్డ
దిశ,వెబ్‌డెస్క్: గవర్నర్ తో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్ట్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గవర్నర్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ అంశంలో తనవైపు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ గవర్నర్ తో భేటీ అవుతున్నట్లు సమాచారం.
ఈ భేటీలో ప్రధానంగా పంచాయతీ ఎన్నికల తాజా పరిణామాలను గవర్నర్ కు వివరించనున్నారు. దీంతో పాటు గుంటూరు, చిత్తూరు కలెక్టర్ల బదిలీల అంశం, ప్రభుత్వ పనితీరును గవర్నర్ వద్ద నిమ్మగడ్డ ప్రస్తావించనున్నారు. దీంతో పాటు ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి – ఎన్నికల సంఘానికి ఏర్పడిన విభేదాలతో పాటు ప్రభుత్వంలోని పెద్దలు వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ తో నిమ్మగడ్డ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఈనేపథ్యంలో మధ్యాహ్నం 3గంటలకు పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులతో నిమ్మగడ్డ భేటీ కానున్నారు. గోపాల కృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ తో ఎన్నికల నిర్వహణపై గురించి మాట్లాడనున్నారు.