నైట్ లైఫ్ రీ స్టార్ట్.. నిద్రపోని భాగ్యనగరం

by Shyam |
Nightlife
X

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్​నిద్రపోని నగరం.. పగలూ రాత్రి ఫుల్​బిజీ. అర్ధరాత్రి వేళ ఇరానీ కేఫ్‌లు, అరబ్ మండీలు, ఐస్ క్రీమ్ పార్లర్లు, పబ్‌లు కస్టమర్లతో కిక్కిరిసిపోతుంటాయి. జిగేల్ మనే విద్యుత్ కాంతులతో ధగధగలాడుతూ ఉంటాయి. కానీ, గతేడాది మార్చిలో లాక్ డౌన్ మొదలు కావడంతో నైట్ పార్టీస్ అన్నీ క్లోజ్ అయ్యాయి. నైట్ ఎంజాయ్ మెంట్స్ పూర్తిగా తగ్గాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క ఈవెంట్ లేదు. కుర్రకారు పార్టీలు లేవు. నైట్ లైఫ్ మొత్తం క్లోజ్ అయ్యింది. ఇప్పుడిప్పుడే కొవిడ్ భయాలు కాస్త తగ్గడంతో మహానగరంలో మళ్లీ నైట్ లైఫ్​స్టార్ట్ అయ్యింది. తిరిగి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. భాగ్యనగర వీధులన్నీ మళ్లీ కలకలలాడుతున్నాయి.

కరోనాతో గతేడాది ఇదే సమయంలో పబ్​లు, క్లబ్ లు, ఈవెంట్స్, డ్రైవ్ ఇన్స్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ క్లోజ్ అయ్యాయి. కొవిడ్ వైరస్ భయంతో జనం ఇంటి నుంచి బయటకు రావడమే మానేశారు. కానీ, అన్ లాక్ తో మళ్లీ సిటీ నైట్ లైఫ్ యథావిధిగా కొనసాగుతోంది. పబ్ లు, క్లబ్ లు అన్నీ ఓపెన్ కావడంతో జనం నైట్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో సిటీలోని డ్రైవ్ ఇన్ కెఫేలు, స్ట్రీట్ ఫుడ్ పాయింట్ లు బిజిబిజీగా కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, కొండాపూర్, డీల్ ఎఫ్ లాంటీ ఐటీ కారిడార్స్ లో లాక్ డౌన్ కు ముందులాంటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూత్ నైట్ లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అర్ధరాత్రుళ్లు కార్లు, బైకుల్లో సిటీని చుట్టేస్తూ ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు.

ఫుల్ ఎంజాయ్..

సిటీలో మిడ్ నైట్ లోనూ రోడ్లపై తిరుగుతున్న జనం, ఆక్టివిటీస్ అంతా పగలు, రాత్రి ఒకేలా ఉన్నట్లు కనిపిస్తాయి. చాలామంది నైట్ టైం బయటకు వెళ్లి స్పెషల్ ఫుడ్ తినేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి వాళ్లకోసం శేరిలింగంపల్లి ఏరియాలో మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జీ వంటి ఐటీ కారిడార్స్ లో పలు ఫేమస్ ఫుడ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఫుడ్ ట్రక్కుల దగ్గర ఎక్కువగా జనం కనిపిస్తుంటారు. ఇక బర్త్ డే పార్టీలు, ఫ్రెండ్స్ తో కలిసి నైట్ లైఫ్ ఎంజాయ్ చేసేందుకు చాలా లొకేషన్స్ ఉన్నాయి. కొంతమంది లాంగ్ డ్రైవ్, నైట్ అవుట్స్ అంటూ నెక్లెస్ రోడ్, ఓల్డ్ సిటీ అరబ్ మండీ హోటల్స్, ఇరానీ చాయ్ దుకాణాలకు వెళ్తున్నారు. అలాగే దుర్గం చెరువు, ట్యాంక్ బండ్ వంటి ఫేమస్ ప్లేస్ లలో అర్ధరాత్రుళ్లు ఎక్కువగా జనసంచారం కనిపిస్తుంది.

క్రేజీ డ్రైవ్ ఇన్స్..

నైట్ లైఫ్ కు సిటీలో చాలా ప్లేసెస్ ఫేమస్. అందులో ఓల్డ్ సిటీలో అరబ్ మండీలు, ఇరానీ ఛాయ్ లకు ఫేమస్ అయితే నెక్లెస్ రోడ్ బర్త్ డే పార్టీలకు స్పెషల్ అట్రాక్షన్. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పబ్ ప్రియులకు హాట్ స్పాట్స్. కానీ, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతాల్లో మాత్రం అన్నీ ఒకేచోట కనిపిస్తుంటాయి. నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వారికి ఇప్పుడు ఇదే ఫేవరేట్ ఏరియా. డ్రైవ్ ఇన్స్, పబ్స్, రెస్టారెంట్లు, ఇరానీ చాయ్ హోటల్స్, అరబ్ మండీలు, స్నాక్స్, తోపుడు బండ్ల మీద ఇడ్లీ, దోష, ఐస్ క్రీమ్ పార్లర్స్ ఇలా ప్రతీది ఈ ఏరియాలో కనిపిస్తుంటాయి. ఇన్ని రోజులు నచ్చిన ఫుడ్ ని మిస్ అయిన వారు ఇప్పుడు తెగ లాగించేస్తున్నారు. ఇక అన్ని రకాల ఆహారపదార్థాలు ఒకే చోట దొరికే ప్లేస్ అంటే డ్రైవిన్స్. సిటీలో డ్రైవిన్స్ కి ఎంతో క్రేజ్ ఉంది. ఓన్ వెహికిల్ లో ఫ్రెండ్స్, లవర్స్ , ఫ్యామిలీతో కూర్చుని ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. దీంతో చాలామంది డ్రైవిన్స్ కు క్యూ కడుతున్నారు. బిర్యానీ నుంచి ఇరానీ చాయ్ వరకు, ఐస్ క్రీమ్ నుంచి పాస్తా వరకు అన్ని ఒకే చోట దొరికే ప్లేస్ కావడంతో డ్రైవిన్ లలో రష్ ఎక్కువగానే ఉంటుంది.

సిటీలో చక్కర్లు కొట్టేస్తున్నాం..

మాములుగా అయితే వీకెండ్స్ లో నైట్ అవుట్ కి ఫ్రెండ్స్​తో కలిసి వెళ్తుంటాం. కానీ, కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే నైట్ పార్టీలకు బయటకు వస్తున్నాం. ఫ్రెండ్స్ అందరం కలిసి రైడ్స్ కు వెళ్తున్నాం. సిటీ అంతా చుట్టేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నాం. – రాజేశ్

బాగా ఎంజాయ్ చేస్తున్నాం : రవి ఆదం

లాక్ డౌన్ కు ముందు ఫ్యామిలీతో వీక్ లో కనీసం టూ టైమ్స్​అయినా నైట్ టైంలో డ్రైవిన్ కి వచ్చేవాళ్లం. వీకెండ్స్ లో బయటే డిన్నర్ ప్లాన్ చేసుకుని కారు లో తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్లం. కానీ లాక్ డౌన్ తో మొత్తం మారిపోయింది. ఇంట్లో ఉండటంతో చాలా బోరింగ్ గా అనిపించింది. ఇప్పుడు అంతా నార్మల్ అయ్యింది. చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేస్తున్నాం.

Advertisement

Next Story

Most Viewed