- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రాష్ట్రంలో ఆదివారం నుంచి రాత్రి కర్ఫ్యూ.. మాల్స్ క్లోజ్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కేసులు భారీగా నమోదవుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు కఠినతరం చేయాలని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ఈ క్రమంలో కరోనాను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు మళ్లీ కర్ఫ్యూ, లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నాయి.
ఇందులో భాగంగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఆదివారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నామని, రాత్రి 8 గంటల తర్వాత మాల్స్ కూడా క్లోజ్ చేయాలని ఆదేశించారు.
రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాల్స్ మూసివేయాలని ఉద్దవ్ ఠాక్రే ఆదేశాలు జారీ చేశారు. రాత్రి కర్ఫ్యూని కఠినంగా అమలు చేయాలని అధికారులను ఉద్దవ్ ఆదేశించారు. కాగా నిబంధనలు పాటించకపోతే మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధిస్తామంటూ గతంలో ఉద్దవ్ హెచ్చరించిన విషయం తెలిసిందే.