అధికారుల కీలక నిర్ణయం.. అక్కడ నైట్ కర్ఫ్యూ

by Shamantha N |   ( Updated:2021-11-16 22:17:26.0  )
అధికారుల కీలక నిర్ణయం.. అక్కడ నైట్ కర్ఫ్యూ
X

దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో అక్కడి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న పాజిటీవ్ రేటు నేపథ్యంలో జమ్మూలో నైట్ కర్ఫ్యూ విధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో బుధవారం నుంచి ఈ కర్ఫ్యూ అమలులోకి రానుంది. నవంబర్ 17 (బుధవారం) నుండి రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ(DDMA) డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ అన్షుల్ గార్గ్ మంగళవారం ఓ ట్వీట్‌లో తెలిపారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జమ్మూ నగరంలో నివసించే ప్రజలు కోవిడ్-19 గైడ్ లైన్స్ ను పాటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, తహసీల్దార్లు కొత్త డెవలప్ మెంట్(కోవిడ్ కేసుల పెరుగుదల) గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లపై ప్రకటనలు చేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed