బ్రేకింగ్: ఆ రాష్ట్రంలో కూడా నైట్ కర్ఫ్యూ

by Anukaran |   ( Updated:2021-04-07 03:31:15.0  )
బ్రేకింగ్: ఆ రాష్ట్రంలో కూడా నైట్ కర్ఫ్యూ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతున్న క్రమంలో రాష్ట్రాలన్నీ మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించగా. . తాజాగా పంజాబ్ కూడా అదే బాటలో నడిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఇవాళ పంజాబ్ ప్రకటించింది.

రాత్రి 9 గంటలకు నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించింది. ఈ సందర్భంగా రాజకీయ సమావేశాల మీద పంజాబ్ ప్రభుత్వంనిషేధం విధించింది. అంతిమ సంస్కారాలకు, పెళ్లి వేడుకలకు 50 మంది కంటే ఎక్కువ మందికి అనుమతి లేదని, ఇండోర్‌లో జరిగే వేడుకలకు 100 మందికి అనుమతి ఉందని తెలిపంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులందరూ కార్యాలయాల్లో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలని కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం తెలిపింది. పంజాబ్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు పాటియాలా, లుధియానా సహా 11 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న సంతి తెలిసిందే. పంజాబ్‌లో గడిచిని 24 గంటల్లో 2905 కేసులు నమోదయ్యాయి.

అటు చండీగడ్‌లోనూ నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుకానుంది. ఢిల్లీలో నిన్నిటి నుంచే నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వం వీకెండ్‌లలో కర్ఫ్యూ విధించింది. మధ్యప్రదేశ్‌లో 12 జిల్లాలు, గుజరాత్‌లో 20 జిల్లాలు, ఒడిశాలో 10 జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలవుతున్నాయి.

Advertisement

Next Story