రాజస్థాన్‌లో 144 సెక్షన్

by Shamantha N |   ( Updated:2021-04-20 11:31:23.0  )
రాజస్థాన్‌లో 144 సెక్షన్
X

జైపూర్:రాజస్తాన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడానికి సిద్ధమైంది. ఈ నెల 22వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర హోం శాఖ ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది.

కర్ణాటకలో రెండువారాలు నైట్‌కర్ఫ్యూ

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం బుధవారం నుంచి రెండు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించడానికి ఆదేశాలు వెలువరించింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఈ కాలంలో రెస్టారెంట్లు, పబ్‌లు, జిమ్‌లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు మూసే ఉండనున్నాయి. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఈ ఆంక్షలకు తోడు వీకెండ్ కర్ఫ్యూ యథాతథంగా అమలు చేయనున్నట్టు వెల్లడించింది.

జమ్ము కశ్మీర్‌లో అన్ని జిల్లాల్లో నైట్‌కర్ఫ్యూ

జమ్ము కశ్మీర్‌లోనూ నైట్ కర్ఫ్యూను అన్ని జిల్లాల్లోని పట్టణప్రాంతాలకు వర్తింపజేశారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎనిమిది జిల్లాల్లోని మున్సిపల్, అర్బన్ లోకల్ బాడీ లిమిట్స్‌లోనే నైట్ కర్ఫ్యూ అమలయ్యేది. తాజాగా, 20 జిల్లాల్లోని పట్టణ ప్రాంతాలకూ నైట్ కర్ఫ్యూను విస్తరిస్తున్నట్టు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వివరించింది. దీంతోపాటు మార్కెట్లు, షాపులు, మాల్స్‌లు 50శాతం చొప్పున రొటేషన్ పద్ధతిలో ఓపెన్ చేసుకోవడానికి అనుమతిస్తున్నట్టు పేర్కొంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులోనూ ఈ షరతు వర్తించనుంది

Advertisement

Next Story