- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా మంచికే : నిధి అగర్వాల్
కరోనా మహమ్మారి మానవాళికి గుణపాఠం నేర్పింది. ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఎలాంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందో హెచ్చరించిన కరోనా.. లాక్ డౌన్ వల్ల మనుషులు ఎలా ఉండాలనేది నేర్పింది. శుభ్రంగా ఉండాలని సూచించింది. అంతేకాదు ఈ సమయంలో ఇంట్లోనే ఖాళీగా ఉండకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పింది. సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు సైతం తాము ఏం నేర్చుకుంటున్నామో షేర్ చేయగా… ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఈ సమయాన్ని ఎలా వినియోగించుకుందో చెప్తుంది.
షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల అసలు సమయం దొరికేది కాదని.. లాక్ డౌన్ కారణంగా చాలా టైమ్ దొరికిందని.. ఆన్ లైన్ యాక్టింగ్ క్లాస్‌లో జాయిన్ అయ్యానని తెలిపింది. త్వరలో కోర్స్ పూర్తవుతుందన్న అందాల నిధి… ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా.. కేవలం పెట్ డాగ్‌తో వాకింగ్ కోసం మాత్రమే బయటకు వెళ్తున్నానని చెప్పింది. ఆ సమయంలో కూడా కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది. ఇంటికి తిరిగి వచ్చాక శానిటైజ్ చేసుకుని.. స్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి వెళ్తున్నామని చెప్పింది. ఇలాంటి సమయంలో అభిమానులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది నిధి.