- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వేలానికి ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మ్యూజియం’ వస్తువులు
దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో ఉన్న ఖాళీ స్థలాన్ని ఏదైనా వస్తువుతో ఫిల్ చేయడానికి చూస్తున్నారా? ప్రపంచంలోని అతిపెద్ద పిన్‌బాల్‌ను గదిలో పెట్టుకోవాలనుకుంటున్నారా? నకిలీ ఎలక్ట్రిక్ చెయిర్, వరల్డ్ ఫేమస్ పెయింటింగ్స్ దక్కించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కెనడాలోని నయాగారా ఫాల్స్ సిటీలో ఉన్న ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మ్యూజియం’ వేలంలో పాల్గొనాల్సిందే.
1978, జూన్ 16న ప్రారంభమైన నాటి నుంచి నాలుగు దశాబ్దాల పాటు సందర్శకులను ఆకర్షించిన ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మ్యూజియం’ గతేడాది సెప్టెంబర్‌లో శాశ్వతంగా మూతపడింది. దాంతో అందులోని ఎన్నో పాపులర్ వస్తువులను నిర్వాహకులు వేలానికి ఉంచారు. మినియేచర్ ఖురాన్, గెయింట్ అటారి హెర్‌క్యులెస్ పిన్‌బాల్ మెషిన్, ద క్లాస్ పంచింగ్ బ్యాగ్ గేమ్, గెయింట్ ఉడెన్ చెయిర్, మినియేచర్ బైస్కిల్ వంటి బోలెడు వరల్డ్ ఫేమస్ వస్తువులు ఆక్షన్ కేటలాగ్‌లో పెట్టారు. ప్రముఖ ఆక్షన్ హౌజ్ ‘రిప్లేఆక్షన్’ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉండగా, ఈ వేలం ఈ నెల 22న ప్రారంభమైంది. వచ్చే నెల 12న లైవ్ స్ట్రీమ్ ఆక్షన్ ఉంది. ఇందులో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు.